తెలంగాణ తెచ్చుకున్నది ఆంధ్రా నేతల చెప్పులు మొయ్యటానికా? బీజేపీ, కాంగ్రెస్ లపై హరీష్ ఫైర్
గజ్వేల్లో శనివారం (29-07-2023) మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పలువురి నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లిని సంకల పెట్టుకున్నట్లు తెలంగాణ ద్రోహులంటూ మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలపై ఫైర్ అయ్యారు. తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు వీరిని మోస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు వింటున్నారని, మరోవైపు చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వింటున్నారని నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.