మరో కీలక మ్యాచ్‌కు భారత్ జట్టు సిద్ధమైంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు రెండో వన్డేలో తలపడుతోంది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం టీమిండియా రెండు మార్పులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు రెస్ట్ ఇచ్చింది. వారి స్థానాల్లో సంజూ శామ్సన్, అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు. ఇక ఆతిథ్య విండీస్ జట్టు కూడా రెండు మార్పులతో బరిలో దిగింది. పావెల్, డ్రేక్స్ స్థానాల్లో అల్జారీ జోసెఫ్, కీసీ కార్టీలకు జట్టులో చోటు దక్కింది. తొలి మ్యాచ్ జరిగిన కెన్సింగ్ టన్ ఓవల్ మైదానంలోనే రెండో మ్యాచ్ జరుగుతోంది. ప్రస్తుతం భారత ప్లేయర్లు ఆచితూచి ఆడుతున్నారు.
పూర్తిగా చదవండి..రెండో వన్డేలో రోహిత్ శర్మకు రెస్ట్.. కెప్టెన్‌గా హార్దిక్
వెస్టిండీస్‌తో రెండో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. రెండు మార్పులతో బరిలోకి దిగింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీలకు రెస్ట్ ఇచ్చింది. దీంతో హార్దిక్ పాండ్య జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

Translate this News: