జైపూర్- ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పులు..నలుగురి మృతి!
మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో జైపూర్- ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పులు ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఒక ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.
నేటితో ఐటీఆర్ ఫైలింగ్ ముగింపు ...ఎంతమంది ఐటీఆర్ ఫైల్ చేశారో తెలుసా?
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు గడువు నేటితో ముగియనున్నది. ఇప్పటికే గడుపు పొడిగిస్తూ వచ్చిన కేంద్రం, ఈ సారి మాత్రం మరోసారి గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది. జూలై 30వ తేదీ వరకు 6కోట్లకు పైగా ఐటీఆర్ లు దాఖలయ్యాయని ఐటీ శాఖ తెలిపింది.
దటీజ్ మోదీ.. లోక్ మాన్య తిలక్ జాతీయ అవార్డ్ అందుకోనున్న ప్రధాని.. ఎప్పుడంటే..?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 1వ తేదీని మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును స్వీకరిస్తారు. దేశ అభివృద్ధి, ప్రగతికి విశేష కృషి వ్యక్తులకు ఈ అవార్డును అందిస్తారు.
కేసీఆర్..! నీ అబ్బ జాగీరు కాదు: ఈటల
సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాంజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసుకుటున్న దళితులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. గత ప్రభుత్వం బడంగ్‌పేటలో దళితులకు 42 ఎకరాలు కేటాయిస్తే కేసీఆర్ దానిని దోచుకోవడం ప్రారంభించారని ఆరోపించారు
అయోధ్య లంకలో Rtv
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు తగ్గినా వరద మాత్రం తగ్గలేదు. గోదావరి నది శాంతించినా. ముంపు ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాలు మాత్రం ఇంకా నీటిలోనే నానుతున్నాయి. ఎన్నికల సమయంలో జగన్ తమ గ్రామంలో బ్రిడ్జి నిర్మిస్తామని హామి ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఇటువైపు వచ్చి చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రేపు కేబినెట్ సమావేశం.... పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం....!
సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి వర్గం చర్చించనునుంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తిప్పి పంపిన బిల్లుల విషయంలో తదుపరి కార్యాచరణ ఎలా వుండాలనే విషయంపై చర్చించనున్నట్టు సమాచారం.
పాలమూరు జిల్లా కేసీఆర్ చేతిలో మోస పోయింది...!
పాలమూరు జిల్లా సీఎం కేసీఆర్ చేతిలో మోస పోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏ దందా చూసినా బీఆర్ఎస్ నేతలే వున్నారని ఆరోపించారు. పాలమూరు జిల్లాను అద్దంలా మారుస్తానని ఇచ్చిన హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. తొమ్మిదేండ్లయినా జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదని తీవ్రంగా మండిపడ్డారు.
బీఎస్ రావు సంతాప సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకుడు బీఎస్ రావు సంతాప సభ ఆదివారం రంగారెడ్డి జిల్లా నార్సింగిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్టొన్నారు. బీఎస్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు