జూలై 31, 2023 జీతభత్యాలకు చాలా ముఖ్యమైన రోజు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ఇదే చివరి రోజు. అయితే చివరి రోజుకు ముందు ఈసారి ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేసిన రికార్డును బద్దలు కొట్టినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, జూలై 30 వరకు, 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 6 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు అయ్యాయి. ఈ సంఖ్య గతేడాది జూలై 31 వరకు దాఖలు చేసిన ఐటీఆర్‌ల సంఖ్యను దాటినట్లు ఐటీ శాఖ పేర్కొంది.
పూర్తిగా చదవండి..నేటితో ఐటీఆర్ ఫైలింగ్ ముగింపు …ఎంతమంది ఐటీఆర్ ఫైల్ చేశారో తెలుసా?
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు గడువు నేటితో ముగియనున్నది. ఇప్పటికే గడుపు పొడిగిస్తూ వచ్చిన కేంద్రం, ఈ సారి మాత్రం మరోసారి గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది. జూలై 30వ తేదీ వరకు 6కోట్లకు పైగా ఐటీఆర్ లు దాఖలయ్యాయని ఐటీ శాఖ తెలిపింది.

Translate this News: