రష్మిక మతాంతర వివాహంపై నెట్టింట చర్చ.. పెళ్లి చేసిన వ్యక్తి ఏమన్నారంటే రష్మిక-రణ్ బీర్ మతాంతర వివాహం జరిపించడంపై డైరెక్టర్ సందీప్ వంగా స్పందించారు. ఈ మ్యారేజ్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. డ్రామాను మరింత ఆసక్తికరంగా చూపించేందుకు ఇలాంటి స్టోరీ క్రియేట్ చేశాను. కానీ ముస్లింలను, వారి మతాన్ని నెగెటివ్ గా చూపించే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. By srinivas 23 Dec 2023 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Rashmika Madanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) మ్యారేజ్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఓ డైరెక్టర్ కమ్ హీరో అయిన వ్యక్తిని ప్రేమించి ఎంగేజ్ మెంట్ చేసుకున్న నటి.. ఆ తర్వాత అనుకోకుండా అతనితో విడిపోయింది. అయితే నిశ్చితార్థం తర్వాత వరుస సినిమాలు చేస్తున్న రష్మిక ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్ సినిమాలతోపాటు బాలీవుడ్(Bollywood) లోనూ పాగా వేస్తోంది. ఇటీవలే 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కించిన 'యానిమల్'(Animal) బిగ్ హిట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఇందులో హీరోయిన్ గా నటించిన రష్మిక తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ మూవీ సక్సె్స్ మీట్ లో పాల్గొంటున్న డైరెక్టర్ సందీప్ మూవీలో రష్మిక-రణ్బీర్ ల మతాంతర వివాహంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ మేరకు రణబీర్(Ranbir)-రష్మికలకు మతాంతర వివాహాన్ని తెరపై ప్రత్యేకంగా చూపించడానికి కారణాలున్నాయి. ఈ మ్యారేజ్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. రణ్ విజయ్ (రణ్ బీర్)కి సోదరుడే అయిన శిక్కు కుటుంబీకుడు. అయితే ఆయన అబ్రార్ ముస్లిమ్ గా ఎందుకు మారాడనేది ఇక్కడ ప్రధాన అంశం. ఈ మధ్య కాలంలో చాలామంది హిందువులు, ఇతరులు ఇస్లాం, క్రైస్తవ మతాలలోకి మారడం మనం చూస్తున్నాం. అయితే హిందూ మతంలోకి మారడం మాత్రం మనకు ఎక్కడ కనిపించడంలేదు. కాబట్టి నేను దీనిని హైలెట్ చేయాలనుకున్నాను. అందుకే కులాలు, మతాలు వేరైనా రష్మిక, రణ్ బీర్ ల పెళ్లి స్క్రిప్ట్ ప్రత్యేకంగా ప్లాన్ చేశాను. ఇస్లాం మతంలో బహుభార్యల కల్చర్ చూడొచ్చు. అందుకే దీని ఆధారంగా ఒకే భార్య కాకుండా విభిన్న ముఖాలు కలిగిన మహిళలను చూపించి కథను హైలెట్ చేసేందుకు ప్లాన్ చేశాను. అయితే ఇక్కడ డ్రామాను మరింత ఆసక్తికరంగా చూపించేందుకు ఇలాంటి స్టోరీ క్రియేట్ చేశాను. కానీ ముస్లింలను, వారి మతాన్ని నెగెటివ్ గా చూపించే ఉద్దేశ్యం నాకు లేదు. దీనిపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకుండా జాగ్రత్తపడ్డాను' అంటూ క్లారిటీ ఇచ్చారు సందీప్. ఇది కూడా చదవండి : ‘ఫైటర్’లో రెచ్చిపోయిన దీపిక.. బీచ్ లో అరాచకమే చేసిందిగా! ఈ క్రమంలోనే సినిమాలో శృతిమించిన సన్నిహిత సన్నివేశాలపై కూడా స్పందించిన సందీప్ వంగా.. రణబీర్- రష్మికలు కుటుంబ సభ్యుల ముందే లిప్ లాక్ చేసుకోవడం అనేది ఈ తరం యువజంట నిర్లక్ష్యమంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇక బాబీ డియోల్, అనిల్ కపూర్, సలోని బాత్రా, త్రిప్తి డిమ్రీ, సురేష్ ఒబెరాయ్, శక్తి కపూర్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ డిసెంబర్ 1న విడుదలవగా ఇప్పటివరకూ రూ. 850కోట్ల పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. #bollywood #animal #ranbir #rashmika #rashmika-mandanna #sandeep-vanga మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి