'ఫైటర్'లో రెచ్చిపోయిన దీపిక.. బీచ్ లో అరాచకమే చేసిందిగా! అప్ కమింగ్ మూవీ 'ఫైటర్'లో తనను మునుపెన్నడూ చూడని కొత్త కోణాల్లో చూస్తారంటోంది దీపికా పదుకొణే. హృతిక్‌రోషన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా 2024 జనవరి 25న రిలీజ్ కానుండగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నటి అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తోంది. By srinivas 23 Dec 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి బాలీవుడ్ భామ దీపికా పదుకొణే తన అప్ కమింగ్ మూవీ 'ఫైటర్'పై అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తోంది. హృతిక్‌రోషన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా 2024 జనవరి 25న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న దీపిక తనలో మునుపెన్నడూ చూడని కొత్త కోణాలను ఇందులో చూస్తారంటోంది. అంతేకాదు ఈ సినిమాకోసం చాలా రిస్క్ చేశానని, ఒక దశలో ప్రాణాలు పోతాయని భయపడిన సందర్భాలున్నాయంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ 'ఫైటర్'మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన ఆలోచనా విధానం అమెజింగ్. అయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అభిమానులు నాలో ఎప్పుడూ చూడని కోణాలు ఇందులో చూస్తారు. ఇది ఓ వీరోచిత ప్రేమగాధ. ఈ మూవీలో చాలా సాహసాలు చేశాను. ఎయిర్‌బేస్‌లో రియల్ సుఖోయ్, భారతీయ యుద్ధ విమానాలతో సీన్స్ తెరకెక్కించారు. అప్పుడు కొన్ని స్టంట్స్ చేస్తుండగా ప్రాణాలమీదకు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు' అని చెప్పుకొచ్చింది. ఇది కూడా చదవండి : తొమ్మిదొవ తరగతిలోనే అతనితో ప్రేమలో పడ్డాను.. ఇంకా మరిచిపోలేకపోతున్నా: తాప్సీ అలాగే ఇటీవల మూవీనుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ కు భారీ రెస్పాన్స్ వస్తుండగా 'ఇష్క్ జైసా కుచ్' అనే రొమాంటిక్ సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ మొత్తం బీచ్ లో షూటింగ్ నిర్వహించగా.. ఇద్దరిమధ్య బోల్డ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే దీనిపై కూడా మాట్లాడి దీపిక.. హృతిక్ తో రొమాన్స్ సాంగ్ మంచి అనుభూతిని ఇచ్చిందని, ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా చూస్తున్నప్పుడు హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుందని తెలిపింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తుండగా హృతిక్, దీపికల రొమాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే గ్రాండ్‌గా నిర్మించిన సినిమాలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. #deepika-padukone #hrithik-roshan #fighter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి