Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పలు రైల్వే జోన్లలో ఉద్యోగాల భర్తీ

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ రైల్వేస్ భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తోంది. ఇందులో వివిధ రైల్వే జోన్లలో ప్రస్తుతం రిక్రూట్‌మెంట్ జరుగుతోంది.

New Update
Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పలు రైల్వే జోన్లలో ఉద్యోగాల భర్తీ

Railway Recruitment 2023 : ఇండియన్ సెంట్రల్ రైల్వే(Indian Central Railway) కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తోంది. పలు రైల్వే జోన్లకు సంబంధించి ఉద్యోగాలను వీటి ద్వారా భర్తీ చేయనుంది. ప్రధానంగా అప్రెంటిస్ పోస్టులు, గ్రూప్ D, గ్రూప్-C ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. వీటిలో కొన్నింటికి డిసెంబర్ నెలాఖరు లోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్
ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ భర్తీ చేస్తోంది. అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కోసం 1832 పోస్టులకు నోటిషికేషన్ను విడుదల చేసింది. దీనికి అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 9లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసేవారు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి పాసై ఉండాలి లేదా అందుకు సమానమైన కోర్సు పూర్తిచేసి ఉండాలి.

Also read:రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

నార్త్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్
నార్త్ సెంట్రల్ రైల్వే కూడా అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ చేపడుతోంది. అప్రెంట్రిస్ యాక్ట్ ప్రకారం యువకులకు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఇవ్వడానికి 1697 పోస్టులను భర్తీ చేస్తుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 14 లోపు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

కొంకణ్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్
కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా అప్రెంటిస్‌షిప్ పోస్టుల(Jobs) భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ konkanrailway.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. ఈ గడువు డిసెంబర్ 9న ముగుస్తుంది.

నార్త్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్
నార్త్ రైల్వే‌లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrcnr.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా, ఈ గడువు డిసెంబర్ 11న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 3081 పోస్టులు భర్తీ కానున్నాయి. పదో తరగతిలో వచ్చిన మార్కులు, ఐటీఐ పరీక్షలో వచ్చిన సగటు మార్కులను పరిగణనలోకి తీసుకుని, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పశ్చిమ రైల్వే రిక్రూట్‌మెంట్
వెస్ట్రన్ రైల్వే తాజాగా గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 64 పోస్టులు భర్తీ చేస్తుంది. అందులో గ్రూప్ సీ పోస్టులు 21 కాగా, మిగిలిన 43 పోస్టులు గ్రూప్ డికి సంబంధించినవి.

అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrc-wr.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డిసెంబర్ 19న ముగుస్తుంది. 2024 జనవరి 1 నాటికి దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.

Advertisment
తాజా కథనాలు