NIA Raids : ఢిల్లీ(Delhi), తమిళనాడు(Tamilnadu), కర్ణాటక(Karnataka), తెలంగాణ(Telangana) లతో పాటూ మరో రెండు రాష్ట్రాల్లో ఎన్ఐఏ(NIA) సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం 17 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. లష్కరే ఉగ్రవాది బెంగళూరు పరప్పన జైల్లోని ఖైదీలకు ఉగ్రవాద భావజాలం బోధిస్తున్నట్టు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా వీటిని చేపట్టినట్లు తెలుస్తోంది. దాంతో పాటూ 2031లో ఇదే జైలు నుంచి తీవ్రవాదులు తప్పించుకుని పారిపోయారు. ఆ తరువాత అనుమానితుల ఇళ్ళల్లో సోదాలు చేయగా భారీగా ఆయుధాలను స్వీదీనం చేసుకున్నారు. దాంతో పాటూ ఐదుగురు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. 7 పిస్తోళ్లు, 4 హ్యాండ్ గ్రానేడ్లు, 45 లైవ్ రౌండ్లు, 4 వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత ఈ కేసును బెంగళూరు పోలీసులు ఎన్ఐఏ కు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దీని మీద 2024 జనవరిలో ఛార్జి షీటు దాఖలు చేవారు. ఇప్పుడు అందులో భాగంగానే సోదాలు కూడా నిర్వహిస్తున్నారు.
బెంగళూరు(Bangalore) లో పట్టుబడ్డ నిందితులకు తీవ్రవాద సంస్థలతో లింకులన్నట్టు తెలుస్తోంది. వీటి మీద ఎన్ఐఏ ఆరా తీస్తోంది. వీరికి పలు కేసుల్లో భాగస్వామ్యం కూడా ఉన్నట్టు చెబుతోంది ఎన్ఐఏ. దీనికి సంబంధించిన కేసులో మొత్తం ఎనిమిది మంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(National Investigation Agency) చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో కేరళలోని కన్నూర్‌కు చెందిన నజీర్ కూడా ఉన్నాడు. ఇతను 2013 నుంచి బెంగళూరు జైలులో జీవిత కైదులో ఉన్నాడు. మరో ఇద్దరు జునైద్ అహ్మద్ అలియాస్ జేడీ, సల్మాన్ ఖాన్ విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. వీరితో పాటూ ఉన్నవారు సయ్యద్ సుహైల్ ఖాన్ అలియాస్ సుహైల్, మహ్మద్ ఉమర్ అలియాస్ ఒమర్, జాహిద్ తబ్రేజ్ అలియాస్ జాహిద్, సయ్యద్ ముదస్సిర్ పాషా, మహ్మద్ ఫైసల్ రబ్బానీ అలియాస్ సాదత్‌లుగా గుర్తించారు.
Also Read:Israel-Hamas War : ఇజ్రాయెల్ మీద క్షిపణి దాడి.. భారతీయుడి మరణం