Israel-Hamas War : ఇజ్రాయెల్ మీద క్షిపణి దాడి.. భారతీయుడి మరణం ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా హమాస్ చేసిన క్షిపణి దాడుల్లో భారతీయుడు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. By Manogna alamuru 05 Mar 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Indian Man Dies : ఇజ్రాయెల్-హమాస్(Israel-Hamas) మధ్య యుద్ధం మొదలై ఐదు నెలలు అవుతోంది. కానీ ఎవరూ తగ్గడం లేదు. గాలో వేలమంది పాలస్తీనియన్లు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అంతేకాదు గాజాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అక్కడ విలయం తాండవిస్తంది. తిండి, నీరు, ఉండడానికి జాగా లేక ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. అయినా కూడా ఇటు ఇజ్రాయెల్..అటు హమాస్ ఇద్దరూ తగ్గడం లేదు. ఎవరికి వారే పట్టు పట్టుకుని కూర్చున్నారు. లెబనాన్ సరిహద్దు నుంచి దాడులు.. హమాస్‌కు మద్దతుగా హిజ్బుల్లా(Hezbollah) కూడా యుద్ధంలోకి దిగింది. లెబనాన్ సరిహద్దుల్లో నుంచి హెజ్బుల్లా కూడా యుద్ధం చేస్తోంది. తాజాగా నిన్న లెబనాన్ భూబాగం నుంచి చేసిన క్షిపణి దాడిలో ఇజ్రాయెల్ఓ ఓ భారతీయుడు మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా కేరళకు చెందిన వారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న మార్గలియట్ అనే వ్యవసాయ క్షేత్రంపై క్షిపణి దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇందులో కేరళ(Kerala) లోని కొల్లామ్‌కు చెందిన పట్నిబిన్ మాక్స్వెల్ మరణించారని చెప్పారు. ప్రస్తుతం ఈయన మృతదేహం స్థానిక జీవ్ ఆసుపత్రిలో ఉందని తెలిపారు. ఈ క్షిపణి దాడిలో జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్ అనే మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. పాల్‌కు ఆపరేషన్ కూడా జరిగింది. బారత్‌లో వారి కుటుంబసభ్యులకు ఇజ్రాయెల్ అధికారులు సమాచారం అందించారు. హమాస్‌కు మద్దతిస్తున్న హెజ్బుల్లా.. ఈ క్షిపణి దాడి చేసింది హెజ్బుల్లా గ్రూపేనని చెబుతోంది ఇజ్రాయెల్. హమాస్‌కు మద్దతుగా ఈ గ్రూప్ దాడులకు తెగడబడుతోందని చెబుతున్నారు. లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్బొల్లా మీద ఇజ్రాయెల్ కూడా దాడులు చేస్తోంది. గాజా(Gaza) లో దాడులు జరుగుతున్నట్టే లెబనాన్‌లో కూడా యుద్ధం జరుగుతోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు ఏడుగురు పౌరులతో పాటు 10 మంది సైనికులు మరణించినట్లు ఐడీఎఫ్ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల వల్ల తమవైపు 229 మంది చనిపోయినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. Also Read : Mouth Freshener : మౌత్ ఫ్రెషనర్ తిని రక్తపు వాంతులు చేసుకున్న కస్టమర్లు! #israel-hamas #gaza #indian #drone-attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి