అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి: లాలూ యాదవ్

రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అమిత్ షాపై విరుచుకుపడ్డారు. అమిత్ షాకు పిచ్చి పట్టిందని అందుకే గొప్ప వ్యక్తి అయిన అంబేద్కర్‌ను అవమానించారన్నారు. వెంటనే అమిత్ షా రాజకీయాలకు రాజీనామా చేయాలని లాలూ డిమాండ్ చేశారు.

New Update
Lalu Prasad YAdav

Lalu Prasad YAdav Photograph: (Lalu Prasad YAdav)

బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అమిత్ షాపై విరుచుకుపడ్డారు. అమిత్ షాకు పిచ్చి పట్టిందని, అంబేద్కర్‌పై ఇంత ద్వేషం ఏంటి? దీన్ని మేం ఖండిస్తున్నానమన్నారు. గొప్పవాడైన అంబేద్కర్‌ను ఇలా అవమానించడం కరెక్ట్ కాదన్నారు. వెంటనే అమిత్ షా రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఇది కూడా చూడండి: హైదరాబాద్ బుక్ ఫెయిర్.. నేటి నుంచే ప్రారంభం

ఇది కూడా చూడండి: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు

పార్లమెంట్‌లో అమిత్ షా ఏమన్నారంటే?

పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా అమిత్ షా అంబేద్కర్‌‌ను ఉద్దేశించి.. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని చెప్పుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్ అయిపోయింది. ఇన్ని సార్లు దేవుడి పేరు పెట్టుకుని ఉంటే వారికి ఆ స్థానం దక్కేదని, స్వర్గమని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఇది కూడా చూడండి: టాలీవుడ్‌లో విషాదం.. బలగం మొగిలయ్య ఇకలేరు

ఇది కూడా చూడండి: BREAKING: ప్రముఖ రచయిత కన్నుమూత

Advertisment
తాజా కథనాలు