/rtv/media/media_files/2025/01/29/2sAK1iOk62BboEFMi5hv.jpg)
haryana CM Photograph: (haryana CM )
Haryana CM: ఢిల్లీ రాజకీయాలు యమునా నదీ చుట్టూ తిరుగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌లు అధికార పార్టీ ఆమ్ అద్మీని టార్గెట్ చేస్తున్నాయి. యమునా నదిపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరుకున పెట్టేస్తున్నాయి. హర్యానా నుంచి యమునా నదిలోకి విషాన్ని విడుదల చేస్తోందని అరవింద్ కెజ్రీవాల్ అన్నారు. ప్రచారం సమయంలో ఆయన హర్యానా రాష్ట్ర ఢిల్లీకి విషపూరితమైన నీళ్లు పంపుతుందని చెప్పారు. ఇన్ డైరెక్ట్ గా కెజ్రీవాల్ హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. దీనిపై ప్రస్తుతం రాజకీయ దుమారం జరుగుతుంది.
Read also : Arvind Kejriwal: యమునా నది వివాదం.. కేజ్రీవాల్‌పై కేసు నమోదు !
కేజ్రీవాల్ వ్యాఖ్యలను ఖండిస్తూ హర్యానా సీఎం నయాబ్ సైనీ ఢిల్లీలో యమునా నదినీటిని తాగారు. నయాబ్ సైనీ ఢిల్లీలోని పల్లా గ్రామంలో యమునా నదిలో నీటిని తాగి కెజ్రీవాల్ మాటలకు కౌంటర్ ఇచ్చారు.
#WATCH | Haryana CM Nayab Singh Saini takes a sip of water from the Yamuna River in Delhi's Palla Village. pic.twitter.com/v1rkJXrcbQ
— ANI (@ANI) January 29, 2025
Also Read: Mazaka Movie: రోడ్లపై సందీప్ కిషన్, రావు రమేష్ డాన్సులు.. 'బ్యాచిలర్స్ ఆంథెమ్' వచ్చేసింది !
కేజ్రీవాల్ కామెంట్స్ పై కేసు..
ఇదిలావుండగా, హర్యానా మంత్రి విపుల్ గోయెల్ బుధవారం కేజ్రీవాల్ కామెంట్స్ పై కేసు నమోదు చేశారు. ఆయన మాటలు ఢిల్లీ ప్రజలను భయాందోళనలకు గురిచేసే విధంగా ఉన్నాయని విపుల్ గోయెల్ మండిపడ్డారు. ఈ అంశంపై ఢిల్లీ సీఎం అతిషి కూడా మాట్లాడారు. యమునా నదిని కలుషితం చేయడం జల ఉగ్రవాదమంటూ వ్యాఖ్యానించారు. హర్యానా నుంచి ఢిల్లీకి వస్తున్న యమునా నీటిలో అమ్మోనియం స్థాయిలు ఆరు రేట్లు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. అయితే కేజ్రీవాల్, అతిషి చేసిన ఆరోపణలను ఢిల్లీ జల బోర్డ్ కొట్టేసింది.
Also Read: నేను తాగే నీళ్లల్లో విషం.. ప్రధాని మోదీ షాకింగ్ కామెంట్స్!