Terror Strikes On August 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్‌లో విధ్వంసం సృష్టించాలని ఉగ్రసంస్థలు కుట్రలు చేస్తున్నాయి. భద్రతా సంస్థలు, రైల్వే స్టేషన్లు, సినిమాహాల్స్ లాంటి బహిరంగ ప్రదేశాలే టార్గెట్ దాడులు చేయాలని కుట్రలు పన్నుతున్నట్టు నిఘా వర్గాల సమాచారం. ముఖ్యంగా దేశ రాజధానిని ముష్కరులు తమ మెయిన్ టార్గెట్ చేసుకున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో (Delhi) భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించాయి. పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే ఉగ్రసంస్థలు దేశంలోని సున్నితమైన ప్రాంతాలు, ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో దాడులు దిగే అవకాశం ఉందని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నిఘా వర్గాలకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. మరో నివేదికనలోనూ కీలక విషయాలు వెల్లడైనట్టు తెలుస్తోంది.
ఉగ్రసంస్థ లష్కరే ఇ తోయిబాతో(Lashkar-e-Taiba) సంబంధం ఉన్న పాక్ కు చెందిన ఓ ఉగ్రనేత ఢిల్లీలోని ప్రముఖ రహదారులు, రైల్వే సంస్థలు, ఢిల్లీ పోలీసు కార్యాలయాలు, జాతీయ దర్యాప్తు సంస్థ NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం) సహా పలు కీలక ప్రాంతాలపై నిఘా పెట్టాలని అతని అనుచరులను ఆదేశించినట్టు నివేదికలో పేర్కొంది. ఢిల్లీతో పాటు భారత్ లోని పలు నగరాల్లో దాడులకు జైషే ఇ మహమ్మద్ సంస్థ దాడులకు రెడీ అవుతోందని ఉగ్రవాది ఒకరు వీడియో సందేశంలో చెప్పినట్టు తెలుస్తోంది.
నిఘా వర్గాల సమాచారంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. వాహనాల తనిఖీ చేపట్టి అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని విచారించి వదిలి వేస్తున్నారు. సుమారు 10 వేల మందితో భద్రతను ఏర్పాటు చేశారు. ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్, సీసీ టీవీలు పెట్టారు.
Also Read: ఎర్రకోట నుంచి ’10 కా దమ్’ ..మోదీ హయాంలో దేశ గ్రోత్ ఇంజన్ ఎంత పెరిగిందో తెలుసా..?