Rameshwaram Cafe Blast : రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. కేంద్రం కీలక నిర్ణయం
ఇటీవల బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై తాజాగా కేసు నమోదు చేసిన ఎన్ఐఏ దర్యాప్తుకు సిద్ధమైంది.