Terror: అగస్టు 15న ఉగ్రదాడులకు ప్లాన్..... అలర్ట్ అయిన భద్రతాదళాలు...!
Terror Strikes On August 15 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్లో విధ్వంసం సృష్టించాలని ఉగ్రసంస్థలు కుట్రలు చేస్తున్నాయి. భద్రతా సంస్థలు, రైల్వే స్టేషన్లు, సినిమాహాల్స్ లాంటి బహిరంగ ప్రదేశాలే టార్గెట్ దాడులు చేయాలని కుట్రలు పన్నుతున్నట్టు నిఘా వర్గాల సమాచారం. ముఖ్యంగా దేశ రాజధానిని ముష్కరులు తమ మెయిన్ టార్గెట్ చేసుకున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి.