Israel-Palestine Conflict:ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం అపరేషన్ అజయ్ ఇజ్రాయెల్, మమాస్ ల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఇండియన్ గవర్నమెంట్ సంకల్పించింది. ఆపరేషన్ అజయ్ ను ప్రారంభించింది. ఇజ్రాయెల్లో ఉన్న 18వేల మంది భారతీయులను దీని ద్వారా ఇండియాకు తీసుకురానున్నారు. By Manogna alamuru 12 Oct 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Operation Ajay Israel: ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత విదేశాంగశాఖ ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణ కోసం అన్ని చర్యలు చేస్తామని, దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపారు విదేశాంగ మంత్రి జైశంకర్ (Jaishankar). ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆపరేషన్ అజయ్ కోసం ప్రత్యేక చార్టర్ విమానాలను రంగంలోకి దించారు. ఇజ్రాయెల్ లో ప్రస్తుతం 18వేల మంది భారతీయులు చిక్కుకున్నారని ముంబయిలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబ్బి శోషని (Kobbi Shoshani) చెప్పారు. కేరళ రాష్ట్రానికి చెందిన 7,000 మంది ప్రజలు ఇజ్రాయెల్‌లో ఉన్నారని, వారి భద్రతకు భరోసా ఇవ్వడానికి జోక్యం చేసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ () కోరారు. ఈ మేరకు సీఎం జైశంకర్‌కు లేఖ రాశారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన 84 మంది వ్యక్తుల గురించి తమకు సమాచారం అందిందని తమిళనాడు ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయుల గురించి అక్కడి భారత దౌత్య కార్యాలయం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంది. వారికి తగిన సలహాలు ఇస్తూ సురక్షితంగా ఉండేలా చూస్తోంది. అయితే ఇప్పుడు పరిస్థితులు మరింత దిగజారుతుండడం, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో వారిని తిరిగి స్వదేశానికి చేర్చాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇజ్రాయెల్‌లో భారతీయుల కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీలో రౌండ్-ది-క్లాక్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ లో పరిస్థితిని పర్యవేక్షించడానికి, భారతీయులకు సహాయం అందించడానికి టెల్ అవీవ్, రమల్లాలో ప్రత్యేక అత్యవసర హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసింది. Launching #OperationAjay to facilitate the return from Israel of our citizens who wish to return. Special charter flights and other arrangements being put in place. Fully committed to the safety and well-being of our nationals abroad. — Dr. S. Jaishankar (@DrSJaishankar) October 11, 2023 Also Read:అమిత్ షాతో లోకేష్ భేటీ.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయాలకు నాంది? #india #hamas #palestine #isreal #hamas-israel-news #operation-ajay మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి