Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి 212 మంది పౌరులతో ఢిల్లీకి చేరిన మొదటి విమానం..!!
ఆపరేషన్ అజయ్ కింద భారత పౌరుల తొలి విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. తొలి విమానంలో 212 మంది భారతీయులను ఇజ్రాయెల్ నుంచి సురక్షితంగా తీసుకొచ్చారు. ఆపరేషన్ అజయ్ కింద, యుద్ధం మధ్య ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకువస్తున్నారు. ఈ ఆపరేషన్ గురువారం అర్థరాత్రి ప్రారంభమైంది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయులు సురక్షితంగా ఇండియాకు తీసుకురానున్నారు.