Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం ఇన్ ఫ్లో లక్షా 80 వేల 686 క్యూసెక్కులు గా కొనసాగుతుంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 72 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారి తెలిపారు.
కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. జూరాల ప్రాజెక్ట్ 31 గేట్లు ఎత్తివేత.శ్రీశైలం వైపు లక్షా 69 వేల క్యూసెక్కులు విడుదల చేసిన అధికారులు. కర్నాటకలో ఆల్మట్టి,మరో నాలుగైదు రోజుల పాటు నిలకడగా వరద కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు.
Also read: భారతీయ పురుషులకు రొమాన్స్ అంటే ఏంటో తెలీదు..!