canada:ఘర్షణల వేళ కెనడాలో మరో ఖలిస్థానీ గ్యాంగ్ స్టర్ హత్య

ఖలిస్తానీ ఉద్యమంలో కీలకమైన మరో గ్యాంగ్ స్టర్ కెనడాలో హత్య గురైనట్లు సమాచారం. ప్రత్యర్ధుల దాడిలో ఇతను మరణించాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. చనిపోయిన అతను పంజాబ్ కు చెందిన సుఖా దునెకే గా గుర్తించారు.

canada:ఘర్షణల వేళ కెనడాలో మరో ఖలిస్థానీ గ్యాంగ్ స్టర్ హత్య
New Update

భారత్-కెనడాల మధ్య గత మూడు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను భారత్ హతమార్చిందని కెనడా ఆరోపించింది. దీంతో ఇరు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించుకున్నారు. ప్రపంచ దేశాలు ఈ ఇష్యూ మీద స్పందిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో కెనడాలో మరో ఖలిస్తానీ సానుభూతిపరుడు హత్యకు గురైనట్లు తెలుస్తోంది. విన్నిపెగ్ లో గ్యాంగ్ స్టర్ సుఖోల్ దోల్ సింగ్ అలియాస్ సుఖా దునెకే ప్రత్యర్ధి జరిపిన దాడిలో మరణించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. అయితే దీని మీద ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన ఏమీ రాలేదు.

దాడిలో చనిపోయిన గ్యాంగ్ స్టర్ సుఖా పంజాబ్ లోని మోఘా జిల్లాలో దేవిందర్ బంబిహా గ్యాంగ్ కు చెందినవాడు. ఇతని మీద భారత్ లో క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2017లో సుఖా ఇండియా వదిలి కెనడా పారిపోయాడని తెలుస్తోంది. అక్కడకు వెళ్ళాక గ్యాంగ్ స్టర్ అర్షదీప్ సింగ్ ముఠాలో చేరాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. సుఖా దునెకే ఖలిస్తానీ ఉద్యమంలో ముఖ్యమైనవాడని...కీలకంగా వ్యవహరించేవాడని సమాచారం.

పంజాబ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ లో దాదాపు 30 మంది సుఖాలానే వివిధ దేశాలకు పారిపోయారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. తప్పుడు వీసాలతో లేదా ముందు భారత్ పక్క దేశమైన నేపాల్ పారిపోయి అక్కడి నుంచి ఇతర దేశాలకు పారిపోయారని తెలుస్తోంది. ఈ 30 మందిలో 8 మంది కెనడాలో ఉన్నట్లు సమాచారం. వారిలో ఒకడే సుఖా దునెకే...ప్రత్యర్ధి కాల్పుల్లో చనిపోయాడు.

అసలే భారత్-కెనడాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. దానికి తోడు ఇప్పుడు మరో ఖలిస్తానీ ఉగ్రవాది మృతి ఘటన చోటు చేసుకుంది. ఖలిస్తానీ టైగర్స్ ఫోర్స్ నిజ్జర్ ఈ ఏడాది జూన్ లో కెనడాలో హత్యకు గురయ్యాడు. బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో గురుద్వారా దగ్గర దుండుగులు అతనిని కాల్చి చంపారు.

కెనడా దర్యాప్తుకు భారత్ సహకరించాలి..

ఇక మరోవైపు నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భారత్...కెనడాకు సహకరించాలని అమెరికా చెబుతోంది. కెనడా చేసిన ఆరోపణల్లో నిజం తేలాలంటే ఇదే ఉత్తమమైన మార్గమని సూచిస్తోంది. నిజ్జర్ హత్యతో భారత్ ఏజెంట్లకు సంబంధముందన్న ఆరోపణలు ఆందోళనను కలిగిస్తున్నాయని అంటోంది అగ్రరాజ్యం. నిజ్జర్ హత్య ఘటనలో దర్యాప్తు చేపట్టేందుకు కెనడాలోని ఒట్టావా స్టేట్ చేపట్టిన ప్రయత్నాలకు తాము మద్దతునిస్తామని...దీనికి సంబంధించి భారత అధికారులు సహకరించాలని కోరారు వైట్ హస్ జాతీయ భద్రతా మండలి అధికారి జాన్ కెర్బీ, భారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీలు. నేర విచారణ జరిగితేనే నిజానిజాలు తేలుతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

#attack #killed #india #gangster #canada #punjab #khalisthan #supporter #sukha-duneke
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe