Canada: కెనడాలో హిందువులపై ఖలిస్థానీల దాడులు.. స్పందించిన ట్రూడో
కెనడాలోని బ్రాంప్టన్లో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని అక్కడికి వచ్చిన భక్తులపై ఖలిస్థానీలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సీరియస్ అయ్యారు. అక్కడి ప్రజలు అన్ని మతాలు పాటించే హక్కులను కాపాడతామని తెలిపారు.