Helicopter : గాలివాన ప్రభావం.. సీఎంకు తప్పిన హెలికాఫ్ఠర్ ప్రమాదం

ఒడిశాలోని భువనేశ్వర్‌లో వర్షం కారణంగా.. ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో సీఎం నవీన్ పట్నాయక్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ భువనేశ్వర్‌ ల్యాండింగ్ కాలేదు. దాదాపు 30 నిమిషాల పాటు గాల్లోనే తిరిగింది. చివరికి ఝర్సుగూడలో ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

New Update
Helicopter : గాలివాన ప్రభావం.. సీఎంకు తప్పిన హెలికాఫ్ఠర్ ప్రమాదం

CM Missed An Accident : దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత(Heat Waves) ఉండగా.. పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షం(Rain) కురుస్తోంది. సోమవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో వర్షం కురిసింది. ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌(Naveen Patnaik) ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ భువనేశ్వర్‌ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ కాలేదు. దీంతో బిజు జనతా దళ్ పార్టీ నేతలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చివరికి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: కేజ్రీవాల్‌కు మరో షాక్.. NIA విచారణకు ఆదేశం

ఎన్నికల ప్రచారం ముగించుకొని సీఎం నవీన్ పట్నాయక్, సీనియర్ బీజేపీ(BJP) నేత కార్తిక్ పాండియన్‌ ఖరియర్‌ నుంచి హెలికాప్టర్‌లో తిరిగి వస్తున్నారు. అయితే గాలివాన తీవ్రత పెరిగి ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో.. హెలికాప్టర్‌ ల్యాండింగ్ అయ్యేందుకు సాధ్యం కాలేదు. సుమారు 30 నిమిషాల పాటు అలా భువనేశ్వర్‌ ఎయిర్‌పోర్ట్‌ పైనే చక్కర్లు కొట్టింది. చివరికి అక్కడి నుంచి బయలుదేరి ఝర్సుగూడలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

Also Read:  క్రికెట్‌ బాల్‌ ప్రైవేట్ పార్ట్‌కు తగిలి 11 ఏళ్ల బాలుడు మృతి

Advertisment
తాజా కథనాలు