AP Elections 2024: ఉలుకు లేదు.. పలుకూ లేదు.. బీజేపీ పొత్తులో భాగమేనా?

ఏపీలో బీజేపీ అభ్యర్థుల పోటీ చర్చనీయాంశమైంది. టీడీపీ, జనసేనలతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు అంతా భావించారు. కానీ బీజేపీ ఎక్కువ సీట్లు అడిగిందని, దీంతో టీడీపీ, జనసేన అభ్యర్థులను ముందుగానే ప్రకటించారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. పురంధేశ్వరి దీనిపై క్లారిటీ ఇవ్వట్లేదు.

New Update
AP Elections 2024: ఉలుకు లేదు.. పలుకూ లేదు.. బీజేపీ పొత్తులో భాగమేనా?

Will BJP Alliance with TDP-Janasena: ఏపీలో బీజేపీ అభ్యర్థుల పోటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇంతకాలంగా టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తులో భాగంగానే ఎన్నికలకు వెళ్తాయని అందరూ భావించారు. చంద్రబాబు, పవన్ ఢిల్లీలో బీజేపీ నేతలను కలిసి చర్చలు జరిపారు. దీంతో మూడు పార్టీలు పొత్తు ఉండబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ నిన్న ఇందుకు భిన్నంగా అనూహ్యపరిణామాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, జనసేన (Janasena) మొదటి జాబితాను విడుదల చేయగా ఇందులో బీజేపీ (BJP) అభ్యర్థుల పేర్లు లేకపోవడం చర్చనీయాంశమైంది. దాదాపు 118 నియోజకవర్గాలకు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించగా టీడీపీ (TDP) 94 మంది, జనసేనకు 24 సీట్లు కేటాయించారు.

హైకమాండ్‌దే తుది నిర్ణయం..
అయితే బీజేపీ అభ్యర్థుల విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటికే పొత్తులపై రాష్ట్ర పార్టీ నేతలు బీజేపీ హైకమాండ్‌కు తమ అభిప్రాయాలను తెలపగా.. పొత్తులపై బీజేపీ హైకమాండ్‌దే తుది నిర్ణయని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి చెప్పారు. అయినా సరే బీజేపీ అధిష్టానం రాష్ట్రంలో పొత్తులపై ఇంకా అడుగులు వేయలేదు. దీంతో అసలు టీడీపీ, జనసేతో బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులపై తాను చాలా కృషి చేశానని జనసేన అధినేత పవన్ అన్నారు. కానీ బీజేపీతో కాకుండా టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను (TDP-Janasena First List) విడుదల చేయడం విశేషం. కాగా ఇంకా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉన్న నేపథ్యంలో బీజేపీతో పొత్తులో భాగంగానే ఈ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకుండా టీడీపీ, జనసేన ఎదురుచూస్తున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Guinness World Record: అగ్గిపెట్టె సైజులో వాషింగ్ మెషీన్.. ఆంధ్ర కుర్రాడు గిన్నిస్‌ రికార్డు!

మరోవైపు బీజేపీ ఎక్కువ సీట్లు అడిగిందని, దీంతో టీడీపీ, జనసేన అభ్యర్థులను ముందుగానే ప్రకటించారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. నిజానికి బీజేపీతో పొత్తు ఉందా? లేదా అనే విషయంపై చంద్రబాబు, పవన్ అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఇదిలావుంటే.. ఈసారి ఎన్నికల్లో ఏపీలో బీజేపీ బలీయమైన శక్తిగా మారుతుందని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి చెబుతున్నారు. బీజేపీలో ఒక ప్రొసీజర్ ఉందని, పొత్తులపై అధినాయకత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని, ప్రధాని మోడీని ఇప్పుడు కలిసే అవకాశం లేదని ఆమె స్పష్టం చేశారు. 60 రోజుల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ పలు మార్గదర్గకాలు సూచించారని పురంధేశ్వరి చెప్పారు. అతేకాదు టీడీపీ, జనసేన ఇంకా 99 స్థానాలు ప్రకటించాల్సివుందని, అప్పటిలోగ ఏదో ఒక విషయంపై స్పష్టతనిస్తామన్నారు.

Advertisment
తాజా కథనాలు