కొత్త పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాలివే... సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మొదటిరోజు పాత భవనంలో చర్చ మొదలవ్వగా రెండవరోజు 19 నుంచి కొత్త పార్లమెంటు భవనంలో సమావేవాలు జరుగుతాయి. ఈ సెషన్స్ లో రాజ్యసభలో మూడు , లోక్ సభలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం అజెండాను విడుదల చేసింది. By Manogna alamuru 14 Sep 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టిన పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ కు రెడీ అయిపోయింది. ఈనెల 18 నుంచి 22 వరకు దీనిలో ప్రత్యేక సమావేవాలను నిర్వహించనున్నారు. దీని తాఊలకా అజెండాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి రోజు 18న పాత పార్లమెంటులోనే సమావేశాలు మొదలవుతాయి. ఈరోజు సంవిధాన్ సభ నుంచి 75 ఏళ్ళ భారత పార్లమెంటరీ ప్రస్థానం మీద చర్చ చేస్తారు. భారత్ తాలూకా అనుభవాలు, జ్ఞాపకాలను ఇందులో చర్చించనున్నారు. ఇక రెండవరోజు 19వ తేదీన సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనానికి షిఫ్ట్ అవుతాయి. ఆ రోజు వినాయకచవితి కావడంతో, మంచిరోజును పురస్కరించుకుని కొత్త భవనంలో సమావేశాలు మొదలుపెడుతున్నట్లు సమాచారం. 19 నుంచి 22 వరకు రాజ్యసభలో మూడు, లోక్ సభలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన అజెండాలో పేర్కొన్నారు. అయితే బిల్లుల చర్చ జాబితా ప్రస్తుతానికి తాత్కాలికమే అని...అవసరమయితే మరికొన్ని బిల్లులను కూడా ప్రవేశపెడతామని తెలిపింది. వీటిల్లో రాజ్యసభ ఆమోదించి లోక్ సభలో పెండింగ్ లో ఉన్న బిల్లులు అడ్వకేట్స్ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు గురించి చర్చిస్తారు. అలాగే రాజ్యసభలో ప్రవేశపెట్టి, స్టాండింగ్ కమిటీకి పంపని మరో రెండు బిల్లులు దిపోస్టాఫీస్ బిల్లు, ది ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్స్(అప్పాయింట్ మెంట్, కండీషన్స్ ఆఫ్ సర్వీస్, అండ్ టెర్మ్ ఆఫీస్) బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో.. జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు, మహిళా బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి లాంటి కీలక బిల్లులను గురించి మాత్రం ప్రభుత్వం అజెండాలో ఏమీ చెప్పలేదు. కేంద్రం వ్యూహాత్మకంగానే కావాలనే ఈ అంశాల ప్రస్తావన అజెండాలో తీసుకురావడంలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రహస్య అజెండాలో భాగంగానే సాధరణ బిల్లులను మాత్రమే అజెండాలో చేర్చారని అంటున్నారు. సాధారణ సమావేశాల్లో కూడా ఆమోదం పొందే అవకాశం ఉన్న బిల్లుల కోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయడం ఏంటని అడుగుతున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇటీవల ఇండియా పేరును భారత్‌గా మార్చడం, జమిలి ఎన్నికల అంశాలను తెరపైకి తీసుకొచ్చిన కేంద్రం సెషన్స్ లో వాటి గురించి చర్చిస్తారో లేదో చెప్పకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక పార్లమెంటు సమావేశాలకు సరిగ్గా ఒక్కరోజు ముందు అంటే 17వ తేదీన ఆల్ పార్టీ ఫ్లోర్ల లీడర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. దీని కోసం అన్ని పార్టీల సభా పక్ష నేతలకు సమాచారాన్ని పంపింది. #loksabha #rajyasabha #bjp #sessions #new-building #ganesh-chathurdhi #parliment #government #parties #september #india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి