నాకేం తెలియదు..ఆయనే నన్ను ఇరికించారు– హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్

కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు విచారణలో నిందితుడు సంజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేశాడు. నాకేం తెలియదు..ఆయనే నన్ను ఇరికించారని ట్రైనీ డాక్టర్ హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్..వినీత్ గోయల్ మొత్తం కుట్ర చేసి తనను కేసులో ఇరికించాడని చెప్పాడు. 

New Update
roy

Kolakatha Trainee Doctor Rape And Murder Case: 

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కోలకత్తా ట్రైనీ డాక్టర్ రేప్ , హత్య. ఇందులో ప్రధాన నిందితుడు  సంజయ్ రాయ్. ఈ కేసు మీద ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈరోజు ఈ హత్యాచారం కేసును సంజయ్ రాయ్‎ను అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ విచారించారు. ఈ కేసు కోల్ కతాతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత నడుమ నిందితుడిని కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టు హాల్ తలుపులు మూసి మరీ నిందితుడిని విచారించారు.

Also Read: విటమిన్ డి, మెగ్నీషియం కలిపి తీసుకుంటే ఏమౌతుంది?

ఈ విచారణలో సంజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేశాడు.  ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనతో తనకు సంబంధం లేదని.. కోల్‌కొతా మాజీ పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్ కుట్ర పన్ని తనను ఈ కేసులో ఇరికించాడని సెన్సేషనల్ ఎలిగేషన్స్ చేశారు. అయితే దీనికి కారణాలు ఏంటి, ఎలా అతనిని కేసులో ఇరికించారనే విషయాలు మాత్రం చెప్పలేదు. డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్ మీద సెక్షన్ 64 (రేప్), సెక్షన్ 66, సెక్షన్ 103 కింద రాయ్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. 

Also Read: బీర్‌తో జుట్టును కడగడం మంచిదేనా?

Also Read: Food App: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు