Hezbollah: ఇజ్రాయెల్ మీద మళ్ళీ దాడి చేసిన హెజ్బోల్లా

ఇజ్రాయెల్‌లోని హైఫా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని హెజ్బొల్లా మళ్ళీ దాడులకు దిగింది. మొత్తం 90 రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో చాలా మందికి గాయాలయ్యాయి. భవనాలు, కార్లు దెబ్బతిన్నాయి.

New Update
11

Hezbollah attacks: 

ఇజరాయెల్, హెజ్బొల్లా ఎక్కడా యుద్ధాన్ని ముగించేలా కనబడడం లేదు. ఎవరైనా కామ్‌గా కొన్నాళ్ళు ఉంటే మరొకరు దాడులతో రెచ్చగొడుతున్నారు. తాజాగా ఈరోజు ఇజ్రాయెల్ మీద హెజ్బొల్లా మరొకసారి విరుచుకుపడింది. హైఫా నగరం లక్ష్యంగా  రాకెట్లతో దాడులు చేసింది. దాదాపు 90 రాకెట్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో ఎంత మంది చనిపోయారు ఇంకా తెలియనప్పటికీ...చాలా మంది గాయపడ్డారని సమాచారం. రాకెట్ల ప్రయోగంతో చాలా భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయని స్థానిక మీడియా తెలిపింది. 

అయితే హెజ్బొల్లా దాడులను ఇజ్రాయెల్ సమర్ధవంతంగా ఎదుర్కొంది. మొదటగ దాదాపు 80 రాకెట్లు వరుసగా దూసుకువచ్చాయి. వాటిలో అధిక సంఖ్యలో రాకెట్లను ఐడీఎఫ్ ఎయిర్ డిఫెన్స్ దీటుగా ఎదుర్కొంది. అపుడు మళ్ళీ రెండో సారి రో 10రాకెట్లు దూసకువచ్చాయి. వాటిని కూడా కూడా ఇజ్రాయెల్ అడ్డుకున్నప్పటికీ కొంత నష్టం జరిగింది.   అక్టోబర్ 8 ఇదే మాదిరిగా హైఫా నగరం మీద హెజ్బొల్లా దాడులు చేసింది. అప్పుడు దాదాపు 100 రాకెట్లను ప్రయోగించింది. 

Also Read: Russia: అంతా ఉత్తిదే..పుతిన్‌కు ట్రంప్ అసలు ఫోన్ చేయలేదు

Advertisment
తాజా కథనాలు