పాపం ఎంత ప్రయత్నించినా ట్రంప్ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన చేసిన ప్రయత్నాలన్నీ తిప్పికట్టాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా ట్రంప్ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. తనకు శిక్ష విధిస్తానంటూ న్యూయార్క్ న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాలను అడ్డుకోవాలంటూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మరోవైపు రేపు హష్ మనీ కేసులో న్యూయార్క్ కోర్టు జడ్జి జువాన్ ఎం.మెర్చన్ ట్రంప్‌నకు శిక్షను ప్రకటించనున్నారు. దీంతో శిక్ష ఖరారై శ్వేతసౌధంలోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు. శిక్ష ఖాయం.. పోర్న్ స్టార్ కు హష్ మనీ ఇచ్చిన కేసులో డొనాల్డ్ ట్రంప్ దోసి అని తేలింది. దీనిపై నమోదైన అభియోగాలను కొట్టేసేందుకు న్యూయార్క్ కోర్టు తిరస్కరించింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని న్యాయమూర్తి జువాన్ మర్చన్ స్పష్టంచేశారు. హష్ మనీ లాంటి వ్యవహారాల్లో ట్రంప్‌నకు రక్షణ ఇవ్వలేమని తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలింది. గత డాది నవంబర్‌లో కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అదే సమయంలో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవడంతో దానిని వాయిదా వేసింది. జనవరి 10న ట్రంప్ వ్యక్తిగతంగా లేదా శిక్ష విధించే సమయంలో హాజరుకావచ్చునని జడ్జి చెప్పారు. అయితే ఆయనకు జైలు శిక్ష విధించడం తనకు ఇష్టం లేదని...షరతులతో కూడిన విడుదల లేదా జరిమానా విధించే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. అదే అత్యంత ఆచరణీయమైన పరష్కారమని రాశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోకపోవడంతో శిక్ష పడడం కచ్చితమని తెలుస్తోంది. అయితే ఎటువంటి శిక్ష వేస్తారనేది రేపు తెలుస్తుంది. Also Read: GC: మూడేళ్ల ఎదురుచూపులకు తెర పడింది...మిక్స్‌డ్ టాక్‌లో గేమ్ ఛేంజర్