/rtv/media/media_files/2025/02/20/WXsKw2gqwx2z5FVpofC2.jpg)
Viral Accident Video
Viral Accident Video: సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రపంచ నలు మూలల్లో ఏ చిన్న సంఘటన జరిగినా ఇట్టే కళ్ల ముందుకు వచ్చేస్తోంది. అందులో చాలా వరకు ఊహించని సంఘటనలు అయితే.. మరికొన్ని విచిత్ర వింతలు.. ఇంకొన్ని నవ్వించేవి. తరచూ అలాంటి వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిని చూసి ప్రజలు పరవసించిపోతుంటారు.
వైరల్ వీడియో
తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఆ వీడియో ప్రకారం.. అది ఒక రద్దీగా ఉండే రోడ్డు. అక్కడే కొంచెం ముందుకు వెళ్తే ఒక రౌండ్ సర్కిల్ ఉంటుంది. అయితే అక్కడే ఓ వ్యక్తి ముందు నడుచుకుంటూ వెళ్తాడు.
కర్మ వెంటాడుతుంది….🤘
— వెంగళం (@Vengalams) February 20, 2025
తప్పుకోగలవ్, కానీ తప్పించుకోలేవ్!
pic.twitter.com/KD7Xp1B8Zr
Also Read: America: పనామా హోటల్ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!
అదే సమయంలో ఓ యువతి స్కూటీ నడుపుకుంటూ వెళ్తూ అతడిని గుద్దేస్తుంది. తర్వాత అతడికి సారీ కూడా చెప్తుంది. సర్లే ఆడపిల్ల కదా అని అతడు కూడా ముందుకు వెళ్లిపోతాడు. మళ్లీ ఆ యువతి తన స్కూటీని టర్న్ చేసే ప్రయత్నంలో మరోసారి అతడినే గుద్దేస్తుంది. ఈ సారి మాత్రం మరింత బలంగా డ్యాష్ ఇస్తుంది.
Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్
దీంతో ఇద్దరూ పడిపోతారు. డ్రైవింగ్ చేసిన ఆ మహిళ, నడుచుకుంటూ వెళ్తున్న ఆ వ్యక్తి రోడ్డుపై పడిపోతారు. అందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ.. ‘‘కర్మ వెంటాడుతుంది.. తప్పుకోగలవు, కానీ తప్పించుకోలేవు’’ అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలు కామెంట్లు పెడుతున్నారు. ‘దేవుడా ఏదో పూర్వ జన్మ తాలూకానేమో’ అంటూ కామెంట్లు చేస్తూ నవ్వుకుంటున్నారు.