Viral: అరే మావా ఇలా చేశావేంట్రా.. వరుడిని పరుగులు పెట్టించిన కుర్రాడు ఓ పెళ్లిలో కడుపుబ్బా నవ్వించే సంఘటన జరిగింది. కళ్యాణ మండపానికి ఊరేగింపుగా వెళ్తున్న వరుడి మెడలో నుంచి కరెన్సీ నోట్ల దండను ఓ కుర్రాడు లాక్కుని పారిపోయాడు. గమనించిన వరుడు ఆ కుర్రాడి వెనక పడ్డాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. By Seetha Ram 30 Nov 2024 in నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి చూడ్డానికి చిన్న కుర్రాడే. కానీ చేసింది మాత్రం పెద్ద పని. పెళ్లి బరత్‌లో అందరితో పాటే కలిసిపోయాడు. పెళ్లి కొడుకు పక్కనే నడిచాడు. డీజే బాజేలతో ఊరు ఊరంతా కళ్యాణ మండపానికి చేరుకుంటుంది. ఆ సమయంలో ఆ చిన్న కుర్రాడు చేసిన పని పెళ్లి కొడుకును పరుగులు పెట్టించింది. అందుకు సంబంధించిన వీడియో సైతం ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఏం జరిగింది. ఆ కుర్రాడు ఏం చేశాడు. ఎందుకు పెళ్లి కొడుకు ఆ కుర్రాడి వెంట పడ్డాడు అనే విషయానికొస్తే.. Also Read: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడిక్కడే మృతి! మన దేశంలో వివిధ సంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్లు జరుగుతాయి. అందులో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్లు అధికం అని చెప్పొచ్చు. అంగరంగ వైభవంగా, డీజే బాజేలతో పెళ్లి ఏర్పాటు చేస్తారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కొత్త కొత్త డ్రెస్సుల్లో దర్శనమిస్తుంటారు. ఇదంతా ఒక ఉత్సవంలా నిర్వహిస్తారు. Also Read: మేనమామ కాదు కాలయముడు..ఆస్తి కోసం దారుణం వివాహ వేడుకలో కడుపుబ్బా నవ్వించే ఘటన అయితే అలాంటి వివాహమే ఒకటి జరుగుతుండగా.. అక్కడ అనుకోని ఘటన జరిగింది. ఆ ఘటనతో చుట్టూ ఉండేవారు కడుపుబ్బా నవ్వుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం.. ఓ వివాహ వేడుక జరుగుతుండగా.. వరుడు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కళ్యాణ మండపానికి ఊరేగింపుగా వెళ్తున్నాడు. వీడియో కోసం క్లిక్ చేయండి Also Read: అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం! ఎంతో హుందాగా.. మహారాజు వేషదారణలో మెడలో కరెన్సీ నోట్ల దండతో నడుచుకుంటూ ఊరేగింపుగా వస్తున్నాడు. అదే సమయంలో ఓ కుర్రాడు పెళ్లి కొడుకు మెడలో ఉన్న కరెన్సీ నోట్లను చూశాడు. Also Read: కుమురంభీంలో విషాదం.. పులి పంజాకు యువతి బలి హమ్మయ్య అవి కొట్టేస్తే.. రెండు రోజులు ఖర్చులకు వస్తాయని భావించాడో ఏమో గాని.. ఒక్కసారిగా అతడి మెడలో నుంచి ఆ కరెన్సీ నోట్లను తెంపుకుని పారిపోయాడు. దీంతో వెంటనే షాక్ అయిన వరుడు.. ఆ కుర్రాడిని పట్టుకునేందుకు వెంట పడ్డాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. #currency-notes #marriage #baraat #viral-news #viral-video మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి