దారుణం.. సూట్‌కేసులో సగం కాలిన యువతి మృతదేహం

పంజాబ్‌లోని బతిండా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హైవే పక్కన సూట్‌కేస్‌ను కొందరు స్థానికులు గమనించారు. అందులో ఓ యువతి మృతదేహం సగం కాలిపోయి ఉండటం చూసి షాకైపోయారు.

New Update
Woman's Half-Burnt Body Found In Suitcase On The Side Of Highway In Punjab

Woman's Half-Burnt Body Found In Suitcase On The Side Of Highway In Punjab

పంజాబ్‌లోని బతిండా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హైవే పక్కన సూట్‌కేస్‌ను కొందరు స్థానికులు గమనించారు. అందులో ఓ యువతి మృతదేహం సగం కాలిపోయి ఉండటం చూసి షాకైపోయారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం బెహ్మన్‌ దివానా అనే గ్రామంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలాల్లో పనిచేస్తున్న వ్యక్తులకు పోలీసులకు దీని గురించి సమాచారం ఇచ్చారు. 

Also Read: ఏఐకి సిద్ధంగా లేకుంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోండి.. గూగుల్‌ సంచలన ప్రకటన

ఫోరెన్సిక్‌ బృందంతో పాటు డాగ్‌ స్క్వాడ్‌ను పోలీసులు ఘటనాస్థలానికి రప్పించారు. యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అయితే మహిళ శరీరంపై గాయాల గుర్తులు ఉన్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు. బాధితురాలి వయస్సు 20 ఏళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆ యువతికి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. 

Also Read: బంగ్లాదేశ్‌లో రేపే ఎన్నికలు.. గెలిచేది ఆ పార్టీయే !

Advertisment
తాజా కథనాలు