/rtv/media/media_files/2026/02/11/google-2026-02-11-17-36-59.jpg)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం రోజురోజుకు దూసుకెళ్తోంది. దీంతో అనేక టెక్ కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తమ కంపెనీ ఉద్యోగులకు కీలక ప్రకటన చేసింది. ఏఐ ప్లాన్‌కు రెడీగా లేనివారు స్వచ్ఛందంగా రిటైర్‌మెంట్ తీసుకోవచ్చని సూచనలు చేసింది. అంతేకాదు వాళ్లకు స్వచ్ఛంద పదవీ విరమణకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీని కూడా అందించనుంది.
గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO)లో ఉన్న కొంతమంది ఉద్యోగులకు ఈ ప్యాకేజీ రానుంది. గూగుల్‌లో GBO యూనిట్ అనేది సంస్థ ఉత్పత్తులు, సేవలకు సంబంధించి ప్రకటనలు, ఆదాయ వృద్ధిని పర్యవేక్షిస్తోంది. 2025 ఏడాదికి చూసుకుంటే గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ 400 బిలియన్ డాలర్ల ఆదాయం పొందింది. అయితే 2026లో గూగుల్ ఏఐ సేవలు పెరగనున్నాయని.. దీనికి సిద్ధమయ్యేవారనే సంస్థ కోరుతోందని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్‌ను తెలిపారు.
Also Read: బంగ్లాదేశ్‌లో రేపే ఎన్నికలు.. గెలిచేది ఆ పార్టీయే !
అమెరికాలో కస్టమర్ సేల్స్ బృందాలు, కస్టమర్ ఫేసింగ్ పొజిషన్స్‌కు ఈ ప్యాకేజీ ఉంటుందని చెప్పారు. ఈ స్వచ్ఛంద పదవీవిరమణ విధానాన్ని గూగుల్ మాత్రమే కాదు ఇతర టెక్ కంపెనీలు కూడా తీసుకొచ్చాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి టెక్ దిగ్గజ కంపెనీలు సైతం ఇలాంటి ప్యాకేజీలు అందించనున్నాయి. మైక్రోసాఫ్ట్ సంస్థ అయితే ఏకంగా తన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా ఏఐ సేవలను మరింత పెంచాలనే లక్ష్యంతో వెళ్తున్న గూగుల్‌కు పెద్ద ఎత్తున సపోర్ట్ వస్తోంది. నిధులు సేకరించేందుకు అల్ఫాబెట్ జారీ చేసిన బాండ్లకు కూడా మార్కెట్‌లో ఆదరణ లభించింది. కేవలం 24 గంటల్లోనే రూ.2.9 లక్షల కోట్లను సమీకరించడం విశేషం.
Also Read: 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ కొనుగోలు చేసిన ఎప్‌స్టీన్.. కారణం ఇదే !
Follow Us