Pak Minister: భారత్ చేతిలో ఆఫ్ఘాన్ కీలుబొమ్మ.. మళ్ళీ నోరు పారేసుకున్న పాక్ మంత్రి

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ భారత్ పై మళ్ళీ నోరు పారేసుకున్నారు.  ఇండియా చేతిలో ఆఫ్గాన్ కీలుబొమ్మగా మారిపోయిందని ఆరోపించారు. తమపై దాడి చేస్తే దానికి 50 రెట్ల తీవ్రతతో ప్రతి దాడి చేస్తామని ఖ్వాజా హెచ్చరించారు. 

New Update
pak

Pakistan Defence Minister Khwaja Asif

టర్కీలో శాంతి చర్చలు విఫలం అయ్యాయి. దీంతో పాకిస్తాన్ , ఆఫ్ఘాన్ ల మధ్య మళ్ళీ యుద్ధం జరుగుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మళ్ళీ భారత్, ఆఫ్ఘనిస్థాన్ ల మీద విరుచుకుపడ్డారు. కాబూల్ ను డిల్లీ నియంత్రిస్తోందని ఆరోపించారు. భారత్ చేతిలో ఆఫ్ఘాన్  కీలుబొమ్మగా మారిందని ఖ్వాజా ఆసిఫ్ నోరుపారేసుకున్నారు. ఈసందర్భంగా ఇస్లామాబాద్‌పై దాడి జరిగితే.. దానికి 50 రెట్ల తీవ్రతతో ప్రతిదాడి తప్పదంటూ హెచ్చరికలు చేశారు. పహల్గామ్ దాడి తరువాత జరిగిన దాడుల్లో తన ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ఆఫ్గాన్ ను ఉపయోగించుకుంటోందని ఖ్వాజా నోటికొచ్చినట్లు మాట్లాడారు. 

భారత్ జోక్యం వల్లనే..

ఆఫ్ఘాన్ తో శాంతి చర్చలు ఇతరుల జోక్యం వల్లనే విఫలం అవుతున్నాయని ఖ్వాజా ఆసిఫ్ ఆరోపించారు.  ఆఫ్ఘాన్ చర్చలకు రావడం సంతోషించ దగ్గ విషయమే అయినా భారత్ ప్రభావంతో అవి ఫెయిల్ అవుతున్నాయని అన్నారు. తమ దేశంలో ఉగ్రవాదానికి ఆ దేశమే కారణమన్నారు. అఫ్గాన్‌తో చర్చలు విఫలమైతే.. అది ఆ దేశంతో పూర్తి యుద్ధానికి దారితీయొచ్చని ఆయన హెచ్చరించారు.  కాబూల్‌ను భారత్‌ ఓ సాధనంగా ఉపయోగించుకుంటుందన్నారు. 

బహిరంగ యుద్ధం తప్పదు..

అంతకు ముందు శాంతి చర్చలు విఫలం అయితే ఆఫ్ఘాన్ పై యుద్ధం తప్పితే మాకు ఇంకో ఆప్షన్ లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇప్పటికే వ్యాఖ్యానించారు.  ఇస్తాంబుల్‌లో జరుగుతున్న చర్చలు విఫలమైనా, ఒప్పందం కుదరకపోయినా బహిరంగ యుద్ధం తప్పదంటూ హెచ్చరించారు. మాకు ఆ అవకాశం ఉందంటూ ఖవాజా చెప్పారు.ఆఫ్ఘనిస్థాన్ ఆ పరిస్థితి తెచ్చుకోదని...వారు శాంతిని కోరుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు.

Advertisment
తాజా కథనాలు