/rtv/media/media_files/2025/02/05/HZ0H8MpDabYhjiOeIKvk.webp)
Delhi polls :
Delhi polls :దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికలను అధికార ఆఫ్‌తో పాటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గడచిన 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఆఫ్‌ను గద్దెదించాలని బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తు్న్నప్పటికీ అనుకున్న ఫలితాలు సాధించడంలో మాత్రం విఫలమవుతూనే ఉంది.ఈసారి ఎలాగైన ఢిల్లీలో తన సత్తా చాటాలని అనేక ప్రయత్నాలు చేసింది.
ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మిల్కీపూర్, తమిళనాడులోని ఈరోడ్ స్థానాలకూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కాగా ఈ రోజు జరగనున్న ఎన్నికలకు సంబంధించి 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషితో పాటు పలువురు మహిళలు వివిధ పార్టీల నుంచి పోటీలో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో 96 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 1,55,24,858 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 83,49,645 మంది పురుషులు, 71,73,952 మంది మహిళలు, 1,261 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లుగా ఉన్నారు.వీరిలో సీనియర్ సిటిజన్ల ఓట్లు 24,44,320 ఉండగా.. 80 సంవత్సరాలకు మించి వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 2,77,221. 80 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల ఓటర్లు ఉన్నారు.
ఇది కూడా చదవండి: 666 వాకింగ్ రూల్ గురించి మీకు తెలుసా..?
మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వంటి ప్రముఖులూ ఇంటి నుంచే ఓటు వేశారు. 15 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని ఏలుతోంది. 2014 తరువాత మరో పార్టీకి అవకాశమే ఇవ్వట్లేదు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో అరవింద్ కేజ్రీవాల ను గెలిపిస్తూ వస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటికీ కేజ్రీవల్‌కు మాత్రమే అవకాశం ఇస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఆప్ చరిత్ర తిరగరాసింది. మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 62 స్థానాల గెలుచుకుని తిరుగులేని మెజార్టీని సాధించింది. మళ్లీ అదే చరిత్రను తన పేరుమీదే లిఖించుకోవాలని ఆప్ భావిస్తోంది. కాగా ఈసారి కేజ్రీవల్‌ను జైలుకు పంపడం ద్వారా ఆ పార్టీని కొంతవరకు బలహీన పరిచామని బీజేపీ భావిస్తున్నప్పటికీ ఇప్పటివరకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తిరిగి ఆప్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ ఎన్నికల్లో ఢిల్లీని ఏలే రాజేవరో త్వరలోనే తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: వయస్సు ప్రకారం రక్తంలో చక్కెర స్థాయి ఎంత ఉండాలి?
ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండగగా భావించే ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, తమ ఓటు హక్కును వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. తొలిసారిగా ఓటు వేసే వారికి ఆయన అభినందనలను తెలియజేశారు.