/rtv/media/media_files/2025/02/05/J6lNuTdD9pbPsqdktM49.jpg)
Firing In Sweden
అమెరికాలో కాల్పులు చాలా తరుచుగా జరుగుతుంటాయి. కానీ ఇతర దేశాల్లో ఇది అసాధారణం. మిగతా దేశాల్లో కాల్పులు జరిగాయంటే ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. తాజాగా స్వీడన్ లో ఫైరింగ్ జరిగింది. ఒరెబ్రో నగరంలో ఓ అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాలుపడ్డాడు. ఇందులో అనుమానితుడితో పాటూ మరో పది మంది దాకా చనిపోయారు. ఇంకా చాలా మంది గాయపడ్డారు. కాల్పుల ఘటనతో ఒకెబ్రో నగరంలో భయాందోళనలు చోటుచేసుకున్నాయి. విషయం తెలిసిన వెంటనే భారీ ఎత్తున భద్రతా బలగాలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింగ్ కారణంగా నష్టం పెద్ద ఎత్తున జరిగి ఉండవచ్చని అంటున్నారు. స్వీడన్ లో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు జరగలేదని...దీనిని ఒక పెద్ద ఘటనగా చెప్పొచ్చని అక్కడి పోలీస్ అధికారులు చెబుతున్నారు.
Also Read: ChatGPT:అందుబాటులోకి చాట్ జీపీటీ వాట్సాప్ లో మరో కొత్త సదుపాయం!
There's been a school shooting in Sweeden now. Apparently, this is leaked footage from the scene. pic.twitter.com/vlhFNipdOs
— Mark Jeavons (@mark_jeavo85962) February 4, 2025
ఉగ్రదాడి కాదు..
స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ కు 200 కి.మీ దూరంలో ఒబెర్రో నగరం ఉంది. కాల్పులు చేసింది ఒక్కరే అని ఇతను గతంలో నేరస్థుడు అయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కాల్పులు జరిగాక నిందితుడు తనను తాను కూడా కాల్చుకున్నాడని తెలిపారు. ఉగ్రదాడి అయ్యే అవకాశం లేదని అన్నారు. కాల్పులు జరిగిన ప్రదేశం రిస్‌బెర్గ్‌స్కా స్కూల్ క్యాంపస్‌లో 20 ఏళ్లు పైబడిన విద్యార్థులు ఇక్కడ చదువుకుంటారు.
ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, వలసదారులకు, మానసిక దివ్యాంగులకు ఇక్కడ పాఠాలు బోధిస్తారు. కాల్పులు జరిగిన సమయంలో ఎక్కువ మంది విద్యార్థులు లేరని...అందువల్ల భారీ నష్టం తప్పిందని చెబుతున్నారు. ఘటన తరువాత క్యాంపస్‌లో ఉన్న విద్యార్థులను పక్కనున్న భవనాల్లోకి తరలించారు. ఘటనపై ఆ దేశ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్పందించారు. స్వీడన్‌కు ఇది ఎంతో బాధాకరమైన రోజు అని అన్నారు.
Also Read: Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్ షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్