Mock Drill: కేంద్ర ప్రభుత్వ బిగ్గెస్ట్ యాక్షన్ ప్లాన్.. దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్..

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కేంద్రం కీలక ప్రకటన చేసింది. మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని చెప్పింది. అసలేంటీ మాక్ డ్రిల్? కేంద్రం ఎందుకు దీనిని నిర్వహించాలని చెప్పింది?

New Update
india

Mock Drill Black Out

పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఉగ్రదాడికి కారణం పాకిస్తాన్ అని భారత్ ఆరోపిస్తుంటే..తమ మీద అనవసరంగా నిందలు వేస్తున్నారని ఆ దేశం అంటోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధం అవుతున్నాయి. రేపూ మాపో వార్ అన్నట్టు ఉంది పరిస్థితి. ఇరు దేశాలూ ఇప్పటికే అన్ని రకాలుగా యుద్ధానికి సన్నద్ధమయ్యాయి. ఆర్మీ, వెపన్స సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఇంక కలబడ్డమే ఆలస్యం అన్నట్టు ఉంది పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మే 7న దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ ను నిర్వహించాలని ఆదేశించింది. 

అసలేంటీ మాక్ డ్రిల్..

యుద్ధం ఎప్పుడైనా జరగవచ్చునని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు ఎలా ఉండాలి. వారు అప్రమత్తంగా ఉండడానికి ఏం చేయాలి అన్న విషయాలను చెప్పడమే మాక్ డ్రిల్. యుద్ధం వస్తే దీన్ని ఎలా ఎదుర్కొవాల్సి ఉంటుందనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించాల్సి ఉంటుంది అనే దానిని ఇందులో చెప్పనున్నారు. శత్రువులు అటాక్ చేసినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? అత్యవసర పరిస్థితుల్లో ఏ యాక్ష్ తీసుకోవాలి..తమను తాము రక్షించుకుంటూనే 
కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి..యుద్ధంలో గాయపడ్డ వారిని ఆసుపత్రులకు ఎలా తరలించాలి..అలాంట వారిని తరలించడానికి ఎటువంటి రవాణా అందుబాటులో ఉంచాలి.. అనే అంశాలపై ఆ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.
అంతేకాకుండా వైమానిక దాడి హెచ్చరిక వ్యవస్థల ప్రభావాన్ని అంచనా వేయడం, వైమానిక దళంతో హాట్‌లైన్/రేడియో కమ్యూనికేషన్ లింక్‌ల నిర్వహణ, కంట్రోల్ రూమ్స్, షాడో కంట్రోల్ రూమ్‌లతో అనుసంధానం కావడం, దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడం, క్రాష్ బ్లాక్ అవుట్‌లో ఎలా వ్యవహరించాలి, అగ్నిమాపక- రెస్క్యూ ఆపరేషన్లల్లో ఎలా పాల్గొనాలి, దాడి సమయంలో ప్రజలను ఖాళీ చేయించే ఏర్పాట్లను సమీక్షించడం వంటివి కూడా ఇందులో నేర్పించనున్నారు. 

ఎవరెవరికి ఇస్తారు..

దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ లో  మొత్తం ప్రజలందరూ పాల్గొనవలసి వస్తుందా అంటే కాదని చెబుతున్నారు. దీని కోసం ఎంపిక చేసిన 244 జిల్లాల్లో ఇది ఉంటుంది. సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, హోమ్ గార్డులు, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్లు, వలంటీర్లు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ సభ్యులు, వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో పాటుగా అన్ని రాష్ట్రాలూ మాక్ డ్రిల్ లో ఎయిర్ రైడ్ సైరన్లను మోగించాలి. కీలక ఫ్యాక్టరీలు, కార్యాలయాలు, ఇతర ప్రదేశాలను జాగ్రత్తగా కాపాడుకునే చర్యలను చేపట్టాలి. సివిల్ డిఫెన్స్ సర్వీసులను, ముఖ్యంగా ఆసుపత్రులు, ఫైర్, రెస్క్యూ, డిపోలను యాక్టివేట్ చేయడం వటింవి ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుంది. 

ఈరోజు సమావేశం..

ఈ మాక్ డ్రిల్ పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఈరోజు పలు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్సులో అందరితో మాట్లాడున్నారు. మాక్ డ్రిల్ నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలు, నియమ నిబంధనలపై ప్రధాన కార్యదర్శులతో చర్చించడం వారికి సూచనలివ్వడం చేస్తారు. దీని వలన ప్రజల్లో యుద్ధ భయం తగ్గడంతో పాటూ దానిపై అవగాహన పెరుగుతుందని కేంద్ర హోం శాఖ చెబుతోంది. అంతేకాదు మాక్ డ్రిల్ ద్వారా ప్రజలను యుద్ధానికి సంసిద్ధులుగా చేస్తే ప్రాణ నష్టం కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. మాక్ డ్రిల్ జరిగినప్పుడు ఫోన్ సిగ్నల్స్ బ్లాక్ అవడం, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడం, బహిరంగ ప్రకటనలు, పోలీసులు పారా మిలటరీ దళాల ప్రదర్శనలు లాంటివి జరుగవచ్చని కేంద్ర హోం శాఖ చెప్పింది. 

ప్రజలు ఏం చేయాలి..

మాక్ డ్రిల్ జరుగుతున్నప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కేంద్రం సూచించింది.  స్థానికంగా వచ్చే సూచనలను అనుసరించాలని తెలిపింది. నీరు, మందులు, ఫ్లాష్‌లైట్లు వంటి ప్రాథమిక సామాగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని..
సోషల్ మీడియాలో పుకార్లు లేదా ప్రభుత్వం ధ్రువీకరించని వార్తలను నమ్మొద్దని సూచించింది. కరెంటు లేదా ఇంటర్నెట్ కొద్దిసేపు పోతే భయపడకుండా అధికారిక ప్రకటనల కోసం రేడియో లేదా ప్రభుత్వ ఛానెళ్లను ఫాలో అవ్వాలని తెలిపింది. 

today-latest-news-in-telugu | central-government | pakistan | war 

Also Read: Balvinder Singh Sahni: దుబాయ్ లో భారత బిలయనీర్ కు ఐదేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ

Advertisment
Advertisment
తాజా కథనాలు