Dog bite: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్‌లో ఏరులై పారిన నెత్తురు!

తమిళనాడు కోయంబత్తూరులో దారుణం జరిగింది. ఇటీవల 35 ఏళ్ల రామ్ చానర్‌ను పిచ్చి కుక్క కరిచింది. రేబిస్ ఇన్ఫెక్షన్ సోకడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. కానీ వ్యాధి తీవ్రత పెరగడంతో కుక్కలా ప్రవర్తించిన రామ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గొంతు కోసుకుని చనిపోయాడు. 

New Update
dog bite

dog bite Photograph: (dog bite)

Dog bite: తమిళనాడులో ఘోరం జరిగింది. ఓ పిచ్చి కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆ కుక్క కాటు కారణంగా ఆ వ్యక్తికి రేబిస్ సోకడంతో దారుణానికి పాల్పడ్డాడు. కొంతకాలం కుక్కలా ప్రవర్తించిన ఆయన చివరకు తన ప్రాణాలు తనే అత్యంత దారుణంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగగా పోలీసులు, వైద్యులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. 

తన గొంతును తానే కోసుకుని..

తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంటున్న ఒడిశాకు చెందిన 35 ఏళ్ల రామ్ చానర్‌ను కొన్ని రోజుల క్రితం పిచ్చి కుక్క కరిచింది. ఆ తరువాత రేబిస్ ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. అయితే అప్పటికే రేబిస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందడంతో రామ్ కుక్కలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. చికిత్స తీసుకుంటున్న ఆయన అనుకోకుండా మంగళవారం సాయంత్రం ఐసోలేషన్ వార్డు నోటీసు బోర్డులోని గాజును పగలగొట్టి తన గొంతును తానే కోసుకుని చనిపోయాడు. అతనిలో రాబిస్ లక్షణాలు ఎక్కువయ్యాయని, ఇన్ఫెక్షన్ కారణంగా అతను కుక్కలా ప్రవర్తించడం ప్రారంభించాడని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

Also Read: కొనసాగుతున్న టారిఫ్ వార్..కెనడా మెటల్స్ మీద 50శాతం సుంకాలు

రక్తం పోవడంవల్ల స్పృహ కోల్పోయి..

అయితే పోలీసులు వచ్చే వరకు అతన్ని సూసైడ్ చేసుకోకుండా ఆపలేకపోయామని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. ఎందుకంటే అతను క్వారంటైన్ సమయంలో ఏ ఆసుపత్రి ఉద్యోగిని అయినా కరిచి ఉంటే అతనికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చేది. రాబిస్ లైసావైరస్ ఇన్ఫెక్షన్ జ్వరంతో మొదలవుతుంది. సకాలంలో చికిత్స అందకపోతే ఆ వ్యక్తి హింసాత్మకంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి 2 నుండి 3 రోజుల్లో మరణిస్తాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై రేస్ కోర్స్ పోలీసులకు సమాచారం అందించామని, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి చాలా రక్తం పోవడంవల్ల స్పృహ కోల్పోయి చనిపోయాడని సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవీలో రికార్డ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు