Weather updates: ఢిల్లీలో వర్షం.. ఈ రాష్ట్రాల్లో నేటి మార్చి 1 వరకు ఉరుములు, మెరుపులతో!

ఇవాళ ఢిల్లీలో తేలికపాటి వర్షాలు పడ్డాయి. వాతావరణశాఖ ప్రకారం.. నేటి నుంచి మార్చి1 వరకు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌, జమ్మూ కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

New Update
Weather updates Rain

Weather updates Rain with thunderstorms likely in Delhi, downpours in these states predicted

వేసవి ప్రారంభం అయింది. ఈ క్రమంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో మంచు కరిగి వేగంగా కొండల మీద నుండి జారిపడుతున్నాయి. అలాగే ఇంకొన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి. మరోవైపు మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో వేడి ప్రభావం అధికంగా చూపడం ప్రారంభమైంది. ఇందులో భాగంగానే ఇవాళ (గురువారం) దేశ రాజధాని ఢిల్లీలో తేలికపాటి వర్షాలు పడ్డాయి. దీంతో ఇప్పటి వరకు వాయు కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. అయితే భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. నేటి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. 

రాబోయే 24 గంటల్లో

రాబోయే 24 గంటల్లో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రదేశాలలో భారీ వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 27 (ఇవాళ్టి) నుండి మార్చి 1 వరకు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మితమైన వర్షపాతం సంభవించవచ్చని అంచనా వేసింది. అలాగే ఫిబ్రవరి 27, 28 తేదీల్లో పంజాబ్, హర్యానాలో బలమైన గాలులు (గంటకు 30-40 కి.మీ వేగంతో) వీచే అవకాశం ఉందని పేర్కొంది. 

ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో

నేడు ఉరుములతో కూడిన వర్షం

గురువారం ఢిల్లీలో ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 26, 18 డిగ్రీల సెల్సియస్ ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అంతేకాకుండా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఢిల్లీలో బుధవారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని తెలిపింది.

ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

ఈ రాష్ట్రాల్లో వర్షాలు

ఫిబ్రవరి 28న పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఫిబ్రవరి 27, 28 తేదీల్లో పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రాష్ట్రాలతో పాటు, ఫిబ్రవరి 27 అంటే ఈరోజు నుండి మార్చి 2 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మాహేలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఇది కూడా చూడండిఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

ఈ ప్రదేశాలలో వేడి 

రాబోయే 24 గంటల్లో, గుజరాత్, ముంబై, గోవాతో సహా మహారాష్ట్రలోని అనేక జిల్లాల్లో వేడి కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 28 వరకు వాతావరణం వేడిగా ఉంటుందని వెల్లడించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు