Supreme Court: ఈవీఎంలపై అనుమానాలు.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఎన్నికల తర్వాత ఈవీఎంల నుంచి డేటా తొలగించేందుకు ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారని ఈసీని సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. 15 రోజుల్లోగా దీనిపై నివేదిక అందించాలని ఆదేశించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
EVMs and Supreme Court

EVMs and Supreme Court

మనదేశంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌ (EVM) విధానాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారనేదానిపై ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఈవీఎంలలో ఉన్న డేటాను తొలగించరాదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అసోసియేషన్ ఫర్ డమోక్రటిక్ రిఫార్మ్స్‌ (ADR) ఈ పిటిషన్ దాఖలు చేసింది. 

Also Read: మాఘి పూర్ణిమ స్పెషల్.. కుంభమేళాలో కొత్తగా మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలివే

దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఈవీఎంలలో డేటాను తొలగించకూడదని, కొత్తగా జోడించకూడదని తెలిపింది. అలాగే వాటిని పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. ఎన్నికలు జరిగిన తర్వాత ఈవీఎంల నుంచి డేటాను తొలగించేందుకు ఎలాంటి విధానాన్ని పాటిస్తారో చెప్పాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. 15 రోజుల్లోగా దీనిపై నివేదిక అందించాలని ఆదేశించింది. అయితే ఈవీఎం-వీవీప్యాట్‌ క్రాస్‌ వెరిఫికేషన్‌ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను గతంలోనే సుప్రీంకోర్టు తిరస్కరించింది. 

ఈవీఎంలలో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలనే పిటిషన్లను కొట్టివేసింది. ఈవీఎంలో సింబర్ లోడింగ్ విధానం పూర్తయిన అనంతరం ఆ యూనిట్‌ను సీల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే దాన్ని కనీసం 45 రోజుల పాటు భద్రపరచాలని సూచనలు చేసింది. 

Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో 21413 పోస్టల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

ఎన్నికల ఫలితాల తర్వాత అభ్యర్థులు 7 రోజుల్లోగా తమ అభ్యంతరాలపై ఫిర్యాదు చేయాలని చెప్పింది. మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమోరీని ఇంజనీర్ల టీమ్ చెక్‌ చేయాలని తెలిపింది. అలాగే ఈ వెరిఫికేషన్‌కు అయ్యే ఖర్చులను మాత్రం అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ అయినట్లు తేలితే ఖర్చులు తిరిగి ఇవ్వాలని చెప్పింది. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు