Robbery Case: రూ.4 దొంగతనం.. 51 ఏళ్ల తర్వాత కోర్టు కీలక తీర్పు

మహారాష్ట్రలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గడియారం, రూ.4, చేతి రుమాలు దొంగతనం చేసిన ఓ కేసులో 51 ఏళ్ల తర్వాత నిందితుడు నిర్దోషిగా తేలాడు. 1974లో జరిగిన ఈ దొంగతనం కేసులో సరైన ఆధారాలు లేక పుణె కోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది.

New Update
Watch, Rs 4, And Handkerchief Theft Case Ends After 51 Years in Maharashtra

Watch, Rs 4, And Handkerchief Theft Case Ends After 51 Years in Maharashtra

మహారాష్ట్ర(maharashtra) లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గడియారం(smartwatch), రూ.4, చేతి రుమాలు(Handkerchief) దొంగతనం(robbery-case) చేసిన ఓ కేసులో 51 ఏళ్ల తర్వాత నిందితుడు నిర్దోషిగా తేలాడు. 1974లో జరిగిన ఈ దొంగతనం కేసులో సరైన ఆధారాలు లేక పుణె కోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 1974లో పుణెలోని బండ్ గార్డెన్ పోలీస్‌ స్టేషన్‌లో ఓ దొంగతనం కేసు నమోదైంది. గులాబ్‌ సాహు జాదవ్, ముకుంద కెర్బా వాగ్మారే, రాజారాం తుకారం కాలేపై పోలీసులు కేసు నమోదు చేశారు. గులాబ్, ముకుంద నేరం అంగీకరించారు. 

Also Read: ప్రమాదంలో తాజ్ మహల్.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైర్

Robbery Case Ends After 51 Years

దీంతో వీళ్లిద్దరూ 1975 ఏప్రిల్ 10న దోషులుగా తేలారు. కానీ రాజారం మాత్రం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. 51 ఏళ్లుగా పరారీలో ఉండటంతో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. చివరికి పుణె కోర్టు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎన్‌జే చవాన్ గతేడాది డిసెంబర్ 26 రాజారాంను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చాడు. అతడిపై ఉన్న అన్ని వారెంట్లు రద్దు చేశారు. 

Also Read: ఇరాన్‌లో హై టెన్షన్.. భారతీయులకు విదేశాంగ శాఖ కీలక హెచ్చరిక

Advertisment
తాజా కథనాలు