VIRAL VIDEO: తస్సాదియ్యా.. కోతి చేష్టలు అంటే ఇవే మరి.. చూడండి ఏం చేసిందో!

అల్లరికి కేరాఫ్ అడ్రస్‌ కోతులనే చెప్పుకుంటాం. తాజాగా అలాంటిదే ఓ కోతి చేసిన అల్లరి వైరల్‌గా మారింది. నిర్మానుష ప్రాంతంలో గుండ్రని చక్రం ఉండగా దానిపైకి ఒక కోతిపిల్ల ఎక్కింది. వెంటనే మరొక కోతి వెళ్లి ఆ చక్రాన్ని చుట్టూ తిప్పేసింది. అది వైరల్‌గా మారింది.

New Update
Monkey videos viral on social media

Monkey videos viral on social media

అల్లరి, చిల్లరి చేష్టలకు కోతులు ఎప్పుడూ ముందుంటాయి. మనుషులను విసిగించడం.. దారిలో నడుచుకుంటూ వెళ్తున్న వారిని కొట్టడం.. జుట్టు లాగడం, ఆడుకుంటున్న పిల్లలను ఏడిపించడం ఇలా అనేక విధాలుగా ప్రవర్తించి చిరాకు తెప్పిస్తాయి. అయితే అవి చేసే కొన్ని చేష్టలు మాత్రం కొందరికి కడుపుబ్బా నవ్విస్తాయి.

Also Read :  పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!

చక్రం తిప్పుడే తిప్పుడు

నిత్యం కోతులు చేసే అల్లరి పనులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. చాలా మంది అలాంటి వీడియోలను చూసి తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి వీడియోనే మరొకటి నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. కోతు చేష్టలు అని ఊరికే అనరు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ ఆ కోతులు ఏం చేశాయి..? అనేది తెలుసుకుందాం. 

ఒక నిర్మానుషమైన ప్రాంతంలో గుండ్రని చక్రం వలే ఉన్న కొన్ని వస్తువులు ఉన్నాయి. అక్కడికి చేరుకున్న కొన్ని కోతులు వాటిని చూస్తూ ఉండిపోయాయి. అందులో ఒక చిన్న కోతి పిల్ల ఆ గుండ్రని చక్రంపైకి ఎక్కింది. దీంతో మరోక పెద్ద కోతి వెళ్లి ఆ చక్రాన్ని గిరా గిరా తిప్పి కిందికి దూకేసింది. దీంతో ఆ చక్రంలో ఉన్న కోతి పిల్ల చుట్టూ తిరుగుతూ ఉండిపోయింది. అలా ఆ చక్రం ఆగిపోయే సమయానికి కిందికి దూకేసింది. అందుకు సంబంధించిన దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది ప్రస్తుతం వైరల్‌గా మారింది. మీరు కూడా ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

Also Read :  ఒప్పందం పై పుతిన్‌ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు