Karur stampede: కరూర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. విజయ్ మెడకు చుట్టుకుంటున్న ఉచ్చు!

కరూర్ తొక్కిసలాట ఘటనలో తమిళనాడు పోలీసులు టీవీకే జిల్లా కార్యదర్శి మథియలగన‌ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా ఇతడిని పేర్కొంటూ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో టీవీకే చీఫ్ విజయ్ పేరు లేదు. ఈ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

New Update
Vijay karur stampede

Vijay karur stampede

తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత హీరో  విజయ్‌(actor-vijay) ప్రసంగించిన కరూర్‌ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన సమయంలో 30 మంది మృతి చెందగా మిగతా వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. వీరిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మంది మరణించగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారిలో మహిళలతో పాటు చిన్నారులు ఉన్నారు. ఇంకా 100 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఇది కూడా చూడండి: విజయ్ ఇంటి ముందు భారీ భద్రత.. ఏ క్షణమైనా ఉద్రిక్తత!

ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు..

ఈ క్రమంలో తమిళనాడు పోలీసులు తమిళగ వెట్రి కజగం (టీవీకే) జిల్లా కార్యదర్శి మథియలగన‌ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా ఇతడిని పేర్కొంటూ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో టీవీకే చీఫ్ విజయ్ పేరు లేదు. మథియలగన్ (కరూర్ జిల్లా కార్యదర్శి), బుస్సీ ఎన్ ఆనంద్ (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), సీటీఆర్ నిర్మల్ కుమార్ (రాష్ట్ర సంయుక్త కార్యదర్శి) పేర్లు ఉన్నాయి. అయితే విజయ్ వేలుసామిపురం వద్దకు చేరుకునే ముందు అనధికారికంగా వీరు ముగ్గురు రోడ్‌షోలు నిర్వహించారని, అక్కడ పెద్ద జనసమూహం ఏర్పడిందని తెలుస్తోంది. 

ముగ్గురు పార్టీ నాయకులపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 105, 110,125, 223 కింద కేసులు నమోదు చేశారు. అయితే భద్రతా కోసం పోలీసులు మోహరించగా తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. పోలీసుల హెచ్చరికలను టీవీకే కార్యకర్తలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. దుకాణాలపైన, చెట్ల కొమ్మలు, టిన్ షీట్లపై కార్యకర్తలు కూర్చోకుండా ఆపడంలో ఆఫీసు బేరర్లు విఫలమయ్యారని తెలిపారు. టీవీకే అధినేత విజయ్ కావాలనే కరూర్ జిల్లాలోని వేలుసామిపురం వద్దకు ఆలస్యంగా చేరుకున్నారని, దీంతో భారీగా జనం చేరడంతో తొక్కిసలాట జరిగిందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. వేలుసామిపురం వద్ద విజయ్ వాహనం కొంత సమయం ఆగిపోయింది. అయితే ఉద్దేశపూర్వకంగానే ఆపారని ఆరోపణలు ఉన్నాయి. 

ఇది కూడా చూడండి: Karur Stampede : విజయ్‌ టీవీకే ప్రచారంలో పవర్‌ కట్‌....సంచలన విషయం వెల్లడించిన విద్యుత్‌బోర్డు

Advertisment
తాజా కథనాలు