విజయ్ ఇంటి ముందు భారీ భద్రత.. ఏ క్షణమైనా ఉద్రిక్తత!

తమిళనాడు ప్రభుత్వం TVK పార్టీ అధినేత విజయ్ ఇంటికి భారీగా భద్రత పెంచింది. కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రజలు కోపంతో ఉన్నారు. ఏ క్షణమైనా విజయ్ నివాసం వద్ద ఆందోళనకు దిగవచ్చని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

New Update
Actor Vijay Home

తమిళనాడు ప్రభుత్వం నటుడు, TVK పార్టీ అధినేత విజయ్ ఇంటికి భద్రత భారీగా పెంచింది. కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై ప్రజా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏ క్షణమైనా విజయ్ నివాసం వద్ద ఆందోళనకు దిగవచ్చని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

శనివారం కరూర్ జిల్లాలో విజయ్ నిర్వహించిన బహిరంగ సభలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అభిమానులు, కార్యకర్తల రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగి 39 మందికి పైగా మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు, విచారణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో (ECR) నీలాంగరైలో ఉన్న విజయ్ నివాసం చుట్టూ భద్రతా సిబ్బందిని, పోలీస్ పహారాను పెంచారు.

తొక్కిసలాట ఘటన అనంతరం మృతుల కుటుంబ సభ్యులు, గాయపడిన ప్రజల నుండి, సామాన్య ప్రజల నుండి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో విజయ్ నివాసం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా భద్రతను పటిష్టం చేసినట్లు తమిళనాడు ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు తెలిపాయి.

సాధారణంగానే 'వై' కేటగిరీ భద్రత పొందుతున్న విజయ్ ఇంటి వద్ద, కరూర్ ఘటన తర్వాత అదనపు పోలీసు బలగాలను మోహరించారు. నివాసం వైపు వెళ్లే మార్గాల్లో భద్రతా తనిఖీలను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై విజయ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని ప్రకటించినప్పటికీ, ఈ దుర్ఘటన పార్టీ నిర్వహణ లోపాల కారణంగానే జరిగిందని ప్రతిపక్షాలు, ప్రజల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రభుత్వం అప్రమత్తమై భద్రతను పెంచింది.

Advertisment
తాజా కథనాలు