Kumbh Mela: కుంభమేళాలో మహిళలు బట్టలు మార్చుకుంటున్న వీడియోస్ అంటూ వైరల్!

కుంభమేళాలో మహిళలు స్నానాలు చేస్తున్న, బట్టలు మార్చుకుంటున్న వీడియోలు అంటూ టెలిగ్రామ్‌ ఛానళ్లో లింక్స్ వైరల్ అవుతున్నాయి. ఓ మీడియా ఛానల్ వాటిని ఫ్యాక్ట్‌చెక్ చేసి అవి ప్రయాగ్‌రాజ్‌ వీడియోలు కాదని తేల్చి చెప్పింది. భక్తులు ఆంధోళన చెందాల్సిన పని లేదంది.

New Update
khumbamela viral

khumbamela viral Photograph: (khumbamela viral)

ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చిన మహిళల వీడియోలని సోషల్ మీడియాలో విసృత షేర్ అవుతున్నాయి. మహిళలు దుస్తువులు మార్చకుంటున్నప్పుడు సీక్రెట్‌గా వీడియోలు తీసి వాటి లింక్స్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నది ఒడ్డున మహిళలు స్నానం చేస్తున్న, బట్టలు మార్చుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. పూర్తి వీడియోస్ కోసం టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేయండని మెస్సేజ్‌లు వస్తున్నాయి. 

Also Read: Anand Mahindra: భారత్‌ లో టెస్లా..ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!

అడల్ట్ కంటెంట్‌ ప్రచురించే కొన్ని ఫేస్‌బుక్ పేజీలు మహా కుంభ గంగా స్నానం ప్రయాగ్‌రాజ్ లాంటి క్యాప్షన్‌లతో స్నానం చేస్తున్న మహిళల వీడియోలను షేర్ చేస్తున్నాయి. కొందరు ఈ పోస్ట్‌లలో #mahakumbh2025, #gangasnan, #prayagrajkumbh వంటి హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఉపయోగిస్తున్నారు. జనవరి 13 నుంచి మహాకుంభమేళా కొనసాగుతుంది. కోట్ల సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అక్కడికి వచ్చిన మహిళా భక్తులు దుస్తులు మార్చుకుంటున్న వీడియోలు టెలిగ్రామ్‌లో పెట్టి అమ్ముకుంటున్నారని సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం అవుతుంది. ఓ నేషనల్ మీడియా వాటిని ఫ్యాక్ట్ చెక్ చేసింది. అవి పాత వీడియోస్ అని.. అందులో ఏమాత్రం నిజం లేదని ప్యాక్ట్ చెక్‌లో తేల్చేసింది. కేవలం డబ్బులు సంపాధించడం కోసమే కొందరు దుండగులు ఇలాంటి నీచమైన పనుకు పాల్పడుతున్నారని వెల్లడించింది.

Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే  నో రిఫండ్‌.. ఐటీ శాఖ ఏమందంటే!

మహిళలు అర్థనగ్నంగా ఉన్న ఆ వీడియోస్ కుంభమేళాలోవి కాదని ప్రకటించింది. భక్తులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా పుణ్యస్నానాలు ఆచరించవచ్చని అధికారులు చెబుతున్నారు. మహిళలు స్నానం చేస్తున్న, బట్టలు మార్చుకుంటుండగా రహస్యంగా తీసిన వీడియోలు ఉన్న రెండు టెలిగ్రామ్ ప్రైవేట్ ఛానెల్ గ్రూపులు ఉన్నాయి. అందులో గంగా రివర్ ఓపెన్ బాతింగ్ గ్రూప్, ఓపెన్ బాతింగ్ వీడియోస్ గ్రూప్ వంటి పేర్లతో వీడియోస్ షేర్ చేస్తున్నారు. ఈ ఛానెల్‌లను యాక్సెస్ చేయడానికి ఛార్జ్ రూ.1,999 నుంచి రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ చేస్తున్న సమయంలోనే ఆ రెండు టెలిగ్రామ్ ఛానెళ్లు తొలగించారు. టెలిగ్రామ్ సెర్చ్ ఇంజన్, అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ అయిన టెలిమెట్రియో ప్రకారం.. ఫిబ్రవరి 12 నుంచి 18 మధ్య భారతదేశంలో ఓపెన్ బాతింగ్ అనే పదం ఎక్కువగా సెర్చ్ చేసినట్లు కూడా డేటా చెబుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు