UP: ప్రియుడితో సన్నిహితంగా దొరికిన భార్య.. ఇద్దరికీ పెళ్లి చేసిన భర్త

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తకు దొరికింది. దీంతో ఆ భర్త వాళ్లిద్దరికీ దగ్గరుండి పెళ్లి జరిపించాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Uttar Pradesh man marries off wife to her lover after catching them together

Uttar Pradesh man marries off wife to her lover after catching them together

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తకు దొరికింది. దీంతో ఆ భర్త వాళ్లిద్దరికీ దగ్గరుండి పెళ్లి జరిపించాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. మీర్జాపూర్‌ జిల్లాని అర్వింద్ పటేల్ అనే వ్యక్తి.. చందౌలి జిల్లా హమీద్‌పూర్‌కు చెందిన రీనా అనే మహిళను 25 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి నుంచి వీళ్లు కలిసే ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారు. 

Also Read: లోక్‌సభలో గందరగోళం.. అమిత్‌ షా పైకి పేపర్లు విసిరిన విపక్షాలు..

అయితే రీనాకు చందౌలి జిల్లాకు చెందిన సియారామ్‌ యాదవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వాళ్ల పరిచయమే క్రమంగా వివాహేతర సంబంధం వరకు దారి తీసింది. దాదాపు 20 ఏళ్లుగా వీళ్ల మధ్య వివాహేతర సంబంధం అలా సాగుతూనే వస్తోంది.  సియారామ్ అప్పట్లో అర్వింద్ పటేల్‌కు చెందిన షాప్‌లోనే పనిచేసేవాడు. అదే సమయంలో అతడికి ఆమెతో పరిచయం ఏర్పడింది. చివిరికి అది వివహేతర సంబంధానికి దారి తీసింది. గత 20 ఏళ్ల నుంచి వీళ్ల మధ్య ఆ వ్యహారం సాగుతూ వస్తోంది. అర్వింద్‌ పటేల్‌కు వాళ్లపై అనుమానం రావడంతో పలుసార్లు పట్టుకునే ప్రయత్నం కూడా చేశాడు. కానీ ఈసారి రెడ్‌ హ్యాండెడ్‌గా వాళ్లిద్దరూ దొరికిపోయారు.

Also Read: హీటెక్కుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక.. NDAకి గట్టి పోటీ ఇవ్వనున్న ఇండియా కూటమి

ఈ ఘటనపై అర్వింద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సియారామ్, అలాగే తన భార్య కుటుంబీకులకు కూడా ఈ విషయం చెప్పాడు. ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడాడు. చివరికి వాళ్లిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ల కుటుంబ సభ్యులను కూడా ఒప్పించాడు. ఈ క్రమంలోనే వారణాసిలోని ఓ గుడిలో వాళ్లకు పెళ్లి జరిపించాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. అర్వింద్ పటేల్ చేసిన పనిని కొందరు సమర్థిస్తున్నారు. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. 

Also Read: అలాస్కా వ్యక్తికి రూ.19 లక్షల బైక్‌ను గిఫ్డ్‌ ఇచ్చిన పుతిన్.. ఎందుకంటే ?

Advertisment
తాజా కథనాలు