చిలుకను పట్టిస్తే రూ.1 లక్ష.. ఆఫర్ అదిరింది గురూ..!

ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్ షహార్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తాను పెంచుకున్న రామ చిలుక కనిపించకుండా పోయిందని.. దాన్ని వెతికి పట్టుకున్నవారికి రూ.లక్ష బహుమతి ఇస్తా అంటూ నవీన్ పాఠక్ అనే వ్యక్తి చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
Missing Parrot

నా రామ చిలుక ఎగిరిపోయింది. దాని జాడ వెతికి పట్టుకున్నవారికి రూ.లక్ష బహుమతి ఇస్తా అంటూ ఓ వ్యక్తి చేసిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్ షహార్‌లో స్థానికంగా ఉండే నవీన్ పాఠక్‌ విష్ణు అనే రామ చిలుకను పెంచుకుంటున్నారు. అది డిసెంబర్ 10న కనిపించకుండా పోయింది. 

ఎక్కడికి వెళ్లిందో తిరిగి ఇంటికి చేరుకోలేదు. సాయంత్రం అయింది కానీ ఆ రామ చిలుక రాలేదు. దీంతో నవీన్ పాఠక్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఇక అది ఎంతకూ ఇంటికి రాకపోవడంతో మొత్తం వెతికాడు. ఇంటి చుట్టూ, పరిసర ప్రాంతాల్లో వెతకాడు. ఆ చుట్టుపక్కల వారిని అడిగాడు. కానీ ఎక్కడా ఆ రామ చిలుక జాడ తెలియలేదు. 

ఇది కూడా చూడండి: లెస్బియన్స్‌తో సహజీవనం చట్టబద్ధమే.. హైకోర్టు సంచలన తీర్పు

తిండి తినని కుటుంబం

దీంతో నవీన్ పాఠక్ కుటుంబం మొత్తం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఏకంగా తినడమే మానేశారు. ఈ నేపథ్యంలోనే నవీన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా తన రామ చిలుకను తన వద్దకు తెచ్చుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే విష్ణు అనే రామ చిలుకను తీసుకువచ్చి ఇచ్చిన వారికి దాదాపు రూ.లక్ష బహుమతి ఇస్తానని ప్రకటించాడు. 

ఇది కూడా చూడండి:  ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ

దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ రామ చిలుక 2 ఏళ్ల క్రితం గాయపడి ఒక చోట పడి ఉండగా.. నవీన్ దాన్ని తీసుకొచ్చి చికిత్స చేయించాడు. అప్పటి నుంచి తన వద్దే పెంచుకుంటున్నాడు. అప్పుడే దానికి విష్ణు అనే పేరు పెట్టాడు. ఇక ఆ చిలుక కూడా వారి ఇంట్లో వ్యక్తిలాగానే మారిపోయింది. అలాంటి చిలుక ఇప్పుడు దూరమవడంతో అంతా బెంగపెట్టుకుంటున్నారు. 

ఇది కూడా చూడండి:  బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు