బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడునుంది. దీనివల్ల తమిళనాడు, ఏపీ, యానాంలో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.

New Update
Heavy Rains: భారీ వర్షాలు.. ఏపీ వ్యాప్తంగా స్కూళ్లకు సెలవు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం వైపు వెళ్తోంది. దీంతో తమిళనాడుతో పాటు ఏపీ, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. 

ఇది కూడా చూడండి: సైబర్ నేరాలు అరికట్టేందుకు కీలక ప్రాజెక్టు ప్రారంభించిన పోలీసులు

ఇది కూడా చూడండి: Bengaluru: ఫ్లాట్ మేట్ కోసం ఎక్స్‌లో పోస్ట్..3లక్షలకు పైగా వ్యూస్

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..

విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తా తీరంలో గంటకు గరిష్ఠంగా 55 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వేతో పాటు అన్ని జిల్లాలకు అధికారులు హెచ్చరికలు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచనలు చేసింది.

ఇది కూడా చూడండి:  ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ

ఏపీలోని కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు వాతవారణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా.. కృష్ణ, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాలకు అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.

ఇది కూడా చూడండి: Home Tips: ఇంట్లో ఈ స్థలంలో డబ్బు ఉంచితే పేదరికం తప్పదు

Advertisment
తాజా కథనాలు