/rtv/media/media_files/2024/12/04/piGPLVnVP1k8oHhAMz2R.jpg)
ఫార్ములా ఈ రేసు కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిన్న కేబినెట్ మీటింగ్‌లో ఫార్ములా ఈ–రేస్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం చర్చ నడిచింది. ఫార్ములా ఈ-రేసులో జరిగిన దోపిడీపై సుదీర్ఘంగా విచారణ జరిగింది. కేటీఆర్ అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేస్తుంది. కేటీఆర్‌ను రేపో మాపో అరెస్టు అవుతారని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ-కారు రేసు విచారణకు గవర్నర్ పర్మిషన్ ఇచ్చారన తెలిపారు.
అన్ని వివరాలూ కావాలి..
ఇక ఇప్పుడు ఈ కేసును టేకప్ చేయాల్సిందిగా తెలంగాణ సీఎస్ శాంతకుమారి ఎసీబీకి లేఖ రాశారు. ఈ లేఖలో గవర్నర్ ఇచ్చిన అనుమతిని కూడా జోడించారు. రేస్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం ఎలా జరిగింది...ఎవరు చేశారు అనే విషయాల మీద దర్యాప్తు చేయాలని శాంతకుమారి ఏసీబీని కోరారు. ఈ-కార్ రేసింగ్ మొత్తం వివరాలతో పాటూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దీని నిర్వహణకు అప్పటి మంత్రి కేటీఆర్ తీసుకున్న చర్యలు, ప్రజాధనం దీనికి ఎలా ఉపయోగించారు.. నిబంధనల ఉల్లంఘన ఎలా జరిగిందనే అంశాలపై లోతుగా విచారణ జరపాలని సీఎస్ శాంతకుమారి కోరారు. ఆర్‌బీ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ చెల్లించడం, ముందు డబ్బులు ఇచ్చేసి తర్వాత ఒప్పందం చేసుకోవడం...ది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పులు లాంట విషయాలల్లో అక్కమాలు జరిగాయని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
అయితే ఈ ఫార్ములా కార్ రేస్ హైదరాబాద్ లో చివరి నిమిషంలో జరగకుండా ఆగిపోయింది. ఫిబ్రవర్ 10న హైదరాబాద్‌లో(Hyderabad) జరగాల్సిన ఫార్ములా ఈ రేస్‌ను రద్దు చేస్తున్నామని ఫార్ములా ఈ రేస్(Formula E Race) ఆపరేషన్స్ ప్రకటించింది. ఈ-రేస్ సీజన్ 10కు చెందిన నాలగవ రౌండ్ ఇక్కడ జరగాల్సి ఉంది. అయితే ఈ రేస్ గురించి తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) స్పందిచలేదని...దానికి తోడు మున్సిపల్ శాఖ(GHMC), హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 30వ తేదీ జరగిన ఒప్పందాన్ని మున్సిపల్ శాఖ ఉల్లంఘించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దాంతో పాటూ మున్సిపల్ శాఖకు నోటీసులు కూడా జారీ చేశామని చెబుతున్నారు. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్ఈవో చెబుతోంది.
Also Read: KIMS: శ్రీతేజ్ ఆరోగ్యం విషమం.. హెల్త్ బులెటిన్ విడుదల