BIG BREAKING: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్

ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అశ్విన్ ఈ విషయాన్ని ప్రకటించాడు.

New Update
Ravi Chandran Ashwin

ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అశ్విన్ ఈ విషయాన్ని ప్రకటించాడు. ఈ ప్రకటన చేసేముందు అశ్విన్ డ్రెస్సింగ్ గదిలో విరాట్ కోహ్లీతో భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇంతలోనే ఆశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

ఇది కూడా చూడండి: Bengaluru: ఫ్లాట్ మేట్ కోసం ఎక్స్‌లో పోస్ట్..3లక్షలకు పైగా వ్యూస్

ఇది కూడా చూడండి: సైబర్ నేరాలు అరికట్టేందుకు కీలక ప్రాజెక్టు ప్రారంభించిన పోలీసులు

భారత్ తరపున ఆడినందుకు..

భారత్ తరపున ఆడినందుకు ఎంతో గర్విస్తున్నానని అశ్విన్ వీడ్కోలు సమయంలో అన్నాడు. కెరీర్‌లో 106 టెస్టులు, 537 వికెట్లు, 3503 పరుగులు సాధించానని, భారత్ క్రికెట్‌లో తన భాగస్వామ్యం కూడా ఉండటం ఆనందంగా ఉందని అశ్విన్ తెలిపాడు. భారత్ తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సాధించాడు. టెస్టుల్లో 6 సెంచరీలు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేలో 156 వికెట్లు, టీ20ల్లో 72 వికెట్లు తీశాడు.14 ఏళ్ల పాటు భారత జట్టు తరఫున ఆడాడు. గురువారం అనగా రేపు అశ్విన్ ఇండియాకి రానున్నారు.

అశ్విన్ 2011 నవంబర్ 6న వెస్టీండీస్‌పైన టెస్టు క్రికెట్‌తో అరంగేట్రం చేశాడు. మొత్తంగా 287 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా.. 775 వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా ప్రపంచ క్రికెట్‌లో అశ్విన్ 11వ స్థానంలో ఉన్నాడు. స్వదేశంలో తిరుగులేని స్పిన్నర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. 

ఇది కూడా చూడండి:  ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ

ఇది కూడా చూడండి:  బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు