చిలుక ఆచూకీ చెప్తే రూ.10 వేలు.. నెట్టింట పోస్టర్లు వైరల్
మధ్యప్రదేశ్ కు చెందిన దీపక్ అనే వ్యక్తి.. ఎంతో కాలం నుంచి ఓ చిలుకను పెంచుకుంటున్నాడు. అయితే అది ఇటీవల ఎక్కడికో ఎగిరిపోయింది. దీంతో దీపక్ పెంపుడు చిలక ఆచూకీ చెప్తే.. రూ.10 వేలు నగదు ఇస్తామంటూ పోస్టర్లు వేయించాడు. చిలుక తప్పిపోయిన సమయంలో సరిగ్గా ఎగరలేని స్థితిలో ఉందని, వీధి కుక్కలు ఏమైనా దాడి చేశాయోమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. చిలక గత రెండేళ్లుగా తమతో ఉంటుందని, అందుకే అదంటే తమ కుటుంబానికి ఎంతో ఇష్టమని..