/rtv/media/media_files/2025/06/11/58sblmEUlZimqaHznTaZ.jpg)
UPSC
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన UPSC సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు ఈ లింక్‌పై https://upsc.gov.in/sites/default/files క్లిక్ చేయండి. మే 25న దేశవ్యాప్తంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్ల లిస్టు విడుదలైంది.
Also Read: ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్..500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం
ఈ పరీక్షల్లో అర్హత పొందినవారు మార్కులు, కటాప్ మార్కులు, ఆన్సర్ కీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. మరోవైపు ఇండియన్ ఫారెస్టు సర్వీస్‌లోని ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను కూడా UPSC విడుదల చేసింది. ఐపీఎఫ్‌కు క్వాలిఫై అయిన వారి లిస్టును వేరుగా విడుదల చేసింది.
Also Read: స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక AXIOM-4 ప్రయెగం మళ్లీ వాయిదా
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2025) హాల్‌టికెట్లు రిలీజయ్యాయి. జూన్ 18 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ అధికారులు బుధవారం సాయంత్రం టెట్ హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. డౌన్‌లోడ్ కోసం ఈ లింక్‌పై https://tgtet.aptonline.in/tgtet/HallticketFront క్లిక్ చేయండి. అభ్యర్థులు జర్నల్ నెబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం!