/rtv/media/media_files/2025/05/02/riRNDP6Mp5ivAaboAd87.jpg)
UP intensifies drive
సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ మదర్సాలు , మసీదులు ఇతర మతపరమైన నిర్మాణాలపై, ముఖ్యంగా ఇండో-నేపాల్ సరిహద్దులో ఉన్న వాటిపై కఠిన చర్యలను ముమ్మరం చేసింది. ప్రభుత్వ భూమిలో నిర్మించిన అనధికార మతపరమైన నిర్మాణాలను కూల్చివేస్తోంది. ప్రభుత్వ గుర్తింపు లేని, ప్రాథమిక నియంత్రణ ప్రమాణాలను ఉల్లంఘించే వాటిపై దృష్టి సారించి ఈ ఆపరేషన్ నిర్వహిస్తుంది.
Also Read: Phalgam Attack: పాపం పాక్.. సొంత దేశం పేరెత్తడానికే భయపడుతున్న స్థానిక సెలబ్రెటీలు!-VIDEO
Also Read: Pahalgam Attack ఉగ్రదాడితో కఠిన చర్యలు.. పాకిస్థాన్ స్టార్స్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్..!
ఇండో-నేపాల్ సరిహద్దుకు
మహారాజ్‌గంజ్ జిల్లాలో అధికారులు 11 మదర్సాలను సీజ్ చేశారు. అంతేకాకుండా నేపాల్ సరిహద్దుకు సమీపంలోని ప్రభుత్వ భూమలలో నిర్మించిన మసీదులతో సహా అనేక నిర్మాణాలను కూల్చివేసారు. రెవెన్యూ కోడ్‌లోని సెక్షన్ 67 ప్రకారం, ఇండో-నేపాల్ సరిహద్దుకు 15 కిలోమీటర్ల వ్యాసార్థంలో శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు సహా 139 అక్రమ నిర్మాణాలను గుర్తించి తొలగించినట్లు అధికారులు తెలిపారు. గుర్తింపు లేకుండా ప్రభుత్వభూమిలో నిర్మించిన వాటిని కూడా క్రమపద్ధతిలో సమీక్షించి, చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ కుమార్ ద్వివేది తెలిపారు.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
మైనారిటీ సంక్షేమ అధికారుల నేతృత్వంలోని బృందాలు, పోలీసులు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో జిల్లాలోని 15 పైగా మదర్సాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నిబంధనలను పాటించని 20 మదర్సాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. శ్రావస్తి జిల్లాలోనే గురువారం ఐదు అక్రమ మదర్సాలను సీజ్ చేశారు, దీంతో మొత్తం సంఖ్య 41కి చేరుకుంది. ఈ సంఖ్య మరింతగా పెరగవచ్చునని తెలుస్తోంది.
Also Read: Anu Aggarwal: నా మూత్రం నేనే తాగిన.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు: నటి సంచలనం!
Uttar Pradesh | illegal madarsas | masjids | cm-yogi-adityanath