/rtv/media/media_files/2025/05/01/67wv2xi3kUhz9DPrJosN.jpg)
Pakistani actors Instagram accounts blocked
Pahalgam Attack కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానల్స్‌ను నిషేధించింది. ఈ ఛానల్స్ హానికరమైన, సున్నితమైన విషయాలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించింది.
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్
అంతేకాదు బుధవారం సాయంత్రం పాకిస్థాన్ కి చెందిన ప్రముఖ నటులు మహిరా ఖాన్, హనియా ఆమీర్, అలీ జాఫర్‌ల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ భారతదేశంలో బ్లాక్ అయ్యాయి. వారి ప్రొఫైల్ ఓపెన్ చేయగా.. "Account Not Available In India" అనే సందేశం వస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇది కూడా చూడండి: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..
/rtv/media/media_files/2025/05/01/dSb4X3Pon1Qfmu4pWLaZ.png)
ఇదిలా ఉంటే ఇండియన్ టెలివిజన్ పై అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రముఖ పాకిస్థానీ నటి హనియా ఆమీర్ పహల్గామ్ దాడిపై స్పందిస్తూ.. ''ఎక్కడైనా విషాదం అందరికీ విషాదమే" అంటూ బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. మహిరా ఖాన్ 2017లో షారుఖ్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ చిత్రం ‘రయీస్’లో నటించింది.
ఇది కూడా చూడండి: CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్‌కు కిక్కు దిగే టార్గెట్!
ఇటీవలే పాకిస్థానీ నటుడు ఫహద్ ఖాన్ నటించిన 'అబీర్ గులాల్' చిత్రాన్ని కూడా బహిష్కరించాలి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల నిరసన పోస్టులు తెగ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ‘A Richer Lens Entertainment’, సారేగామా వంటి కంపెనీస్ తమ యూట్యూబ్ ఛానెల్ నుంచి ఆ సినిమా పాటలను తొలగించాయి. అంతేకాదు ఉగ్రదాడి నేపథ్యంలో 'అబీర్ గులాల్' సినిమా విడుదలకు భారతదేశంలో అనుమతి ఉండదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సోని రజ్దాన్, పర్మీత్ సేథీ, లీసా హేయ్డన్, రిద్ధి డోగ్రా, ఫరీదా జలాల్, కీలక పాత్రల్లో నటించారు.
పహాల్గమ్ ఉగ్రవాద దాడిలో 26 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్యపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగహం వ్యక్థమవుతోంది. దీంతో భారత్.. పాకిస్థాన్ తో ఇండస్ జల ఒప్పందాన్ని నిలిపివేయడం, ప్రధాన భూ సరిహద్దు మార్గాన్ని మూసివేయడం, రాయబార సంబంధాలను తగ్గించడం వంటి కఠిన చర్యలు తీసుకుంది.
ఇది కూడా చూడండి: CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి
telugu-news | cinema-news